సినీ ఇండస్ట్రీలో వెండితెరమీద బావబామ్మర్ది అనగానే ముందుగా గుర్తొచ్చేది వెంకటేష్ అలాగే నాగార్జున.. ఇకపోతే అక్కినేని నాగేశ్వరరావు  మనకు ఇండియా కి స్వాతంత్ర్యం రాకముందే సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. ఆయన నటన , ఎంచుకునే కథ విధానంతో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా మిగిలిపోయారు. ఇక ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. ఇకపోతే దగ్గుబాటి రామానాయుడు సొంత ఊరు అయిన కారంచేడు లో నాగేశ్వరావు నటించిన నమ్మినబంటు సినిమా షూటింగ్ జరుగుతోంది. అప్పుడు డి.రామానాయుడుని, అక్కినేని సినీ ఇండస్ట్రీ లోకి రమ్మని ఆహ్వానించారు.

ఇక సరే అని డి.రామానాయుడు తనకున్న వ్యాపారాలు అన్నింటిని ఆపివేసి , తన పెద్ద కుమారుడైన సురేష్ బాబు పేరు మీద 1964వ సంవత్సరంలో సురేష్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించడం జరిగింది. మొదటి సారి" రాముడు భీముడు " సినిమాను ఈ సంస్థ ద్వారా నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమా తర్వాత అక్కినేని, రామానాయుడు కాంబినేషన్ లో వచ్చిన చిత్రం సిపాయి చిన్నయ్య. ఈ సినిమాకు అక్కినేని హీరో అయితే రామానాయుడు నిర్మాత. మరోసారి ప్రేమ్ నగర్ వంటి బ్లాక్ బాస్టర్ మూవీని తెరకెక్కించారు .ఇక వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారారు.

స్నేహం కాస్త బంధుత్వం గా మారింది. అక్కినేని నాగేశ్వర రావు కొడుకు నాగార్జునకు, డి రామానాయుడు తన కూతుర్ని ఇచ్చి వివాహం చేశారు. ఇక 1985వ సంవత్సరంలో డి.రామానాయుడు అలాగే అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరూ కూడా తమ వారసులను సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశపెడుతున్నామని ప్రకటన చేశారు. మొదటిసారి 1986 సంవత్సరంలో విక్రమ్ అనే సినిమా ద్వారా నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇదే సంవత్సరంలో లో  వెంకటేష్ కూడా కలియుగ పాండవులు సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక అలా  బావ బామ్మర్ది ఇద్దరూ ఒకేసారి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: