భారతదేశంలోని పాడి పంటల మార్కెట్ విలువ సంపద 11 లక్షల కోట్లు అంటే నమ్ముతారా? లాభదాయకమైన డెయిరీ వ్యాపారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఐతే సాధారణ వ్యవసాయ పద్ధతులను వినియోగిస్తూ చాలామంది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. వాటిలో టాప్ 5 డెయిరీ బ్రాండ్లు ఏంటో ఇక్కడ చూద్దాం.



1. సిద్ ఫాం:



కిషోర్ ఇందుకూరి అనే ఇంజనీర్ అమెరికాలో లక్షల్లో వేతనం కాదని స్వదేశానికి వచ్చి డెయిరీ ఫామ్ ఏర్పాటు చేశాడు. 20 ఆవులతో స్టార్ట్ చేసిన అతని డెయిరీ ఫాం ఇప్పుడు చాలా పెద్దదిగా విస్తరించింది. 44 కోట్ల టర్నోవర్ తో 120 మంది ఉద్యోగులతో అతని డెయిరీ నడుస్తోంది. కిషోర్ తన డెయిరీ ఫాం ద్వారా ప్రతిరోజు 10 వేల మంది కస్టమర్లకు పాలు అందిస్తారు.



2. మిల్క్ మ్యాజిక్:



కరోనా సమయంలోనూ ప్రతి ఇంటికి పాల ఉత్పత్తులు అందించే లక్ష్యంతో కిషోర్ మోడీ డెయిరీ ఫామ్ ప్రారంభించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ డెయిరీ రెవిన్యూ అక్షరాల 384 కోట్ల రూపాయలు. కిషోర్ తన బ్రాండ్ ద్వారా అన్ని పాల ఉత్పత్తులు విక్రయిస్తారు.



3. హెరిటేజ్ ఫుడ్స్:



ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 1992లో 80 లక్షల రూపాయలతో హెరిటేజ్ ఫుడ్స్ స్టార్ట్ చేశారు. తదనంతరం నేరుగా పాడిపంటల రైతుల నుంచి పాలను సేకరించే కస్టమర్లకు అందజేయడం ప్రారంభించారు. సతీమణి నారా భువనేశ్వరి హెరిటేజ్ ఫుడ్స్ ని అభివృద్ధి చేసి కోట్లు గడిస్తున్నారు.



4. మిస్టర్ మిల్క్:



మిట్టల్ గ్రూప్ వ్యవస్థాపకుడు నరేష్ మిట్టల్ మిస్టర్ మిల్క్ బ్రాండ్ ని స్థాపించి స్వచ్ఛమైన పాలను ప్రజలకు విక్రయిస్తున్నారు. మిస్టర్ మిల్క్ సంస్థ ఇప్పుడు వేల మంది ప్రజలకు పాలను సరఫరా చేస్తూ కోట్లు సంపాదిస్తోంది.



5. జ్ఞాన్ డెయిరీ



జై అగర్వాల్, అతని సోదరుడు అనూజ్ అగర్వాల్ కలిసి 2007లో జ్ఞాన్ డెయిరీని స్థాపించారు. 908 కోట్ల టర్నోవర్ తో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 54 రకాల పాల ఉత్పత్తులను అమ్ముతూ కోట్లల్లో లాభాలను గడిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: