
రోడ్ సైడ్ ఫుడ్ తో పోల్చి చూస్తే అటు స్టార్ హోటల్ లో దొరికే ఆహారం ధర మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. ఒక సామాన్యుడు స్టార్ హోటల్ కి వెళ్ళాడు అంటే అక్కడి దరలతో జేబుకు చిల్లు పడాల్సిందే. ఆ రేంజ్ లో స్టార్ హోటల్స్ లో ధరలు ఉంటాయి. ఇక ఇటీవల ఇదే విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ హోయేంకా. తమిళనాడులో స్టార్ హోటల్లో పరిస్థితి ఎలా ఉంది రోడ్ సైడ్ ఆహారం పరిస్థితి ఎలా ఉంది అన్న విషయాన్ని ఇక తన పోస్టులో చెప్పుకొచ్చాడు. తమిళనాడులోని ఈ రోడ్డు ఇడ్లీ మార్కెట్ లో రోజుకి రెండు వేల ఇడ్లీ అమ్ముతారు.
అది కూడా అతి తక్కువ ధరకు. రెండు ఇడ్లీలు కేవలం మూడు రూపాయల యాభై పైసలు మాత్రమే అమ్ముతారు. ఇక చట్నీ సాంబార్ తో కలిసి కేవలం 6.50 రూపాయలు మాత్రమే. కానీ మన దేశంలో ఉన్న స్టార్ బగ్స్ లో కాఫీ ఏకంగా 250 రూపాయలు. ఇలా కేవలం కాఫీ 250 రూపాయలకు వస్తుంటే అటు ఎంతో రుచికరమైన ఇడ్లీ మాత్రం మూడు రూపాయల 50 పైసల కె వస్తున్నాయి అంటూ హర్ష్ హోయేంకా చెప్పుకొచ్చాడు. ఇక ఇటీవలే హర్ష్ హోయేంకా పెట్టిన పోస్ట్ కి కాస్త నెటిజన్లకు కనెక్ట్ అయిపోతుంది. మీరు చెప్పింది నిజమే సార్ ఒక సామాన్యుడు స్టార్ హోటల్ కి వెళ్లలేని పరిస్థితిలో ఉంది దుస్థితి. కేవలం హోటల్లో మాత్రమే కాదు ఆన్లైన్లో కూడా ఇడ్లీ ఏకంగా 150 రూపాయలకు అమ్ముతున్నారు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.