
ఇక నేడు అమరావతిలో చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. మాజీ మంత్రి చినరాజప్ప తో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబు తో నేతలు అంతా భేటీ అయ్యారు అని అన్నారు. చంద్రబాబు- బుచ్చయ్య మనసువిప్పి మాట్లాడారు అని గోరంట్ల మొదట నుంచి ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. పార్టీ కోసం పని చెయ్యడానికి బుచ్చయ్య సిద్ధం గా ఉన్నారు అన్నారు. ఇక బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ... రాజకీయాల నుంచి వెళ్లిపోవాలి అని అనుకున్నాను అని పార్టీ లోటు పాట్లపై స్పష్టంగా చెప్పాను అన్నారు.
పార్టీ ఎలా ఫైట్ చెయ్యాలి అనేది అధినేతకు చెప్పాను అని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలు మనోభావాలను గుర్తించాలి అని విజ్ఞప్తి చేసారు. పార్టీ లో మార్పులు చెయ్యాల్సిన అవసరం ఉంది అన్నారు ఆయన. పార్టీ లలో వచ్చే వాళ్ళు... పోయేవాళ్ళు ఎక్కువ అయ్యారు అని ఆవేదన వ్యక్తం చేసారు. సామాజికం గా పార్టీ బలోపేతం కావాల్సి ఉంది అని అన్నారు ఆయన. ప్రభుత్వం పై అంతా కలిసి ఫైట్ చేయాల్సి ఉంది అని ఆయన పేర్కొన్నారు. లోటుపాట్లు సరిచేసుకుంటాం అని స్పష్టం చేసారు. లక్షలాది మంది త్యాగాలు వృధా కాకూడదు...అందుకే రాజీనామా ఆలోచన వెనక్కి తీసుకున్నా అని స్పష్టం చేసారు. ప్రోగ్రాం అంటే సెల్ఫీ దిగినట్లు ఉండకూడదని ఆ ఫొటోలతో రాజకీయం కాదు... ప్రజలను కలుపుకుని పోవాలి అని సూచించారు.