ఒకరకంగా తాలిబాన్లకు అమృల్లా సాలెహ్ వణుకు పుట్టిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆఫ్గనిస్తాన్ దేశాన్ని మొత్తం స్వాధీనం చేసుకున్నారు తాలిబాన్లు.. ఇక మరికొన్ని రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఆఫ్ఘనిస్తాన్లోని పంజ్ షేర్ ప్రాంతం మాత్రం ఇప్పటివరకు తాలిబన్ల వశం కాలేకపోయింది. ఇక ఆ ప్రాంతంలో అమృల్లా సాలెహ్ ఆధ్వర్యంలో ఎంతోమంది ఆఫ్ఘనిస్తాన్ సైనికులు తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఒకరకంగా యుద్ధమే చేస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇటీవలే తాలిబన్లు ఏకంగా పంజ్ షేర్ ప్రాంతం పై యుద్ధం చేయడం మొదలుపెట్టారు. దీంతో ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితి హాట్హాట్గా మారిపోయింది. అయితే ఇక అటు తిరుగుబాటుదారులు ఇటు తాలిబన్ల లో కూడా భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది అన్న విషయం మాత్రం తెలుస్తుంది. అయితే ఇటీవలే తాము పంజ్ షేర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాము అంటూ తాలిబన్లు ప్రకటించి సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ అటు వెంటనే అమృల్లా సాలెహ్ చేసిన ప్రకటన మాత్రం సంచలనం గానే మారిపోయింది అని చెప్పాలి. నా తలలోకి రెండు బుల్లెట్లు పంపించిన తర్వాత పంజ్ షేర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోండి. గొంతులో ప్రాణం ఉన్నంత సేపు పోరాడుతూనే ఉంటామ్ అంటూ అమృల్లా సాలెహ్ స్టేట్మెంట్ తాలిబన్ల లో వణుకు పుట్టిస్తుంది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి