ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రో ఓట‌మికి రెడీ అయిన‌ట్టే క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు కొద్ది రోజుల క్రిత‌మే తిరుప‌తి ఉప ఎన్నిక‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. అక్క‌డ వైసీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఎంపీగా గెలిచిన బ‌ల్లి దుర్గా ప్ర‌సాద‌రావు క‌రోనాతో మృతి చెందారు. దీంతో అక్క‌డ జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మిని పోటీలోకి దింపారు. ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పేరు కూడా తెలియ‌ని డాక్ట‌ర్ గురుమూర్తిప పోటీ చేశారు. అయితే ఎన్నిక‌ల్లో వైసీపీ ఏకంగా 2.75 ల‌క్ష‌ల ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించింది.

ఇక ఇప్పుడు మ‌రో ఉప ఎన్నిక‌కు రెడీ కావాల్సిన స‌మ‌యం వ‌చ్చేసింది. ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప జిల్లాలోని బ‌ద్వేల్ ఎస్సీ రిజ‌ర్వ్ డ్ అసెంబ్లీ సెగ్మెంట్ కు త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. క‌రోనా లేక‌పోతే ఈ పాటికే తెలంగాణ‌లోని హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంతో పాటు బ‌ద్వేల్‌కు కూడా ఉప ఎన్నిక జ‌ర‌గాల్సి ఉంది. వ‌చ్చే నెల‌లో బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌ని అంటున్నారు. ఈ ఉప ఎన్నికల్లో డాక్టర్ రాజశేఖర్ నే అభ్యర్థిగా చంద్రబాబు ఖరారు చేశారు.

గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఈ ఓబులాపురం రాజ‌శేఖ‌ర్ డాక్ట‌ర్ వెంక‌ట సుబ్బ‌య్య చేతిలో 40 వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. ఇక ఉప ఎన్నిక‌ల్లోనూ ఆయ‌నే పోటీ చేయ‌నున్నారు. అయితే ఆయ‌న చంద్ర‌బాబుకు పోటీ చేయాలంటే ఓ ష‌ర‌తు పెట్టిన‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే 2024  ఎన్నికల్లోనూ తనకే టిక్కెట్ ఇవ్వాల్సి ఉంటుందని.. కోర‌గా చంద్ర‌బాబు సైతం ఇందుకు ఓకే చెప్పార‌నే అంటున్నారు.

ఒక వేళ ఈ ఉప ఎన్నిక‌ల్లో తాను ఓడిపోయినా.. 2024 ఎన్నిక‌ల‌లో త‌నకు సానుభూతి క‌లిసి వ‌స్తుంద‌న్న కోణంలోనే ఆయ‌న ఈ ష‌ర‌తు పెట్టార‌ని అంటున్నారు. ఏదేమైనా ఉప ఎన్నిక‌ల్లో టీడీపీకి గెలుపుపై ఆశ‌లు లేవు. టీడీపీ ఖాతాలో మ‌రో ఓట‌మి ప‌డిన‌ట్టే..?

మరింత సమాచారం తెలుసుకోండి: