వైసీపీ కీల‌క నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న‌దైన శైలిలో చెక్ పెట్ట‌బోతున్నారా?  ఆయ‌న‌పై క్లీన్ ఇమేజ్ ఉన్న కుటుంబాన్ని చంద్ర‌బాబు పోటీకి నిల‌బెట్ట‌నున్నారా? అంటే.. తాజాగా మారిన ప‌రిస్తితులు, ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. చిత్తూరు జిల్లా పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు సాధిస్తున్నారు పెద్దిరెడ్డి. అయితే.. ఈ ద‌ఫా మాత్రం ఆయ‌న‌పై గ‌ట్టి ఇమేజ్‌.. ప్ర‌జ‌ల్లో సింప‌తీ.. అక్ర‌మాలు, అన్యాయాలు వాస‌న‌లేని కుటుంబాన్ని చంద్ర‌బాబు తీసుకువ‌చ్చి.. పెద్దిరెడ్డిపై నిల‌బెడుతున్నారు.

టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న కుటుంబం చ‌ల్లా ఫ్యామిలీ.ఈ క్ర‌మంలో పుంగనూరు నియోజకవర్గం ఇన్ ఛార్జిగా చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లా బాబును చంద్రబాబు ఇన్ ఛార్జిగా నియమించారు. ఇప్పటి వరకూ పుంగనూరు వైసీపీ ఇన్ ఛార్జిగా ఉ న్న మాజీ మంత్రి అమ‌ర్నాథ్ మ‌ర‌ద‌లు.. అనీషారెడ్డిని తప్పించారు.  ఈ నియామకం వెనక చంద్రబాబు పెద్ద కసరత్తే చేశారంటున్నారు. ప్రధానంగా ఈసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించాలన్నది చంద్రబాబు ఆలోచన.

పెద్దిరెడ్డిని ఎదుర్కొనాలంటే గట్టి నేత, క్లీన్ ఇమేజ్ ఉన్న నాయ‌కుడు కావాలని చంద్రబాబు చాలా కాలం నుంచి అన్వేషిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే 1983, 85లో గెలుపు గుర్రం ఎక్కిన‌.. చ‌ల్లా రామ‌కృష్ణారెడ్డి త‌న‌యుడు.. రామ‌చంద్రారెడ్డి కి ఈ ద‌ఫా టికెట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. రొంపిచెర్ల మండ‌లంలో ఎంపీపీగా రామ‌కృష్ణారెడ్డి చాలాకాలం ప‌నిచేయ‌డంతోపాటు.. క్లీన్ ఇమేజ్ ఉన్న కుటుంబంగా పేరు తెచ్చుకున్నారు. ఇక‌, పెద్దిరెడ్డి విష‌యాన్ని చూస్తే.. ఆయ‌న వ‌య‌సు పైబ‌డింది.

వ‌రుస విజ‌యాలు.. కూడా ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టే అవ‌కాశం ఉంది. ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నారు. స్థానిక ఎన్నిక‌ల్లో ఎక్కువ‌గా ఏక‌గ్రీవాలు జ‌రిగినా.. అవ‌న్నీ బ‌ల‌వంతంగా జ‌రిగాయ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.   ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు క్లీన్ ఇమేజ్ అస్త్రాన్ని పెద్దిరెడ్డిపై ప్ర‌యోగించారు. దీంతో ఆయ‌న గెలుపు క‌ష్ట‌మేన‌ని.. ఈ ద‌ఫా ఖ‌చ్చితంగా టీడీపీ విజ‌యం సాధిస్తుంద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: