ప్రపంచ యుద్దాలు రెండు జరిగాయి. తీరని నష్టాన్నే మిగిల్చాయి. అందుకే ప్రపంచం శాంతి మంత్రాన్ని పాటిస్తుంది. కానీ కరోనా వచ్చింది, ఆ శాంతిని కూడా హరించింది. ఎక్కడ చూసినా తుపాకుల పాలన తప్ప మరొక్కటి కనిపించడం లేదు. ఈ కరోనా సీజన్ లో ఇలాంటి పాలనాలు ఎక్కువ అనే కొత్త రికార్డు కూడా కరోనా సొంత చేసుకుంది. రెండో ప్రపంచ యుద్ధంలో వాడిన అణుబాంబుతో జరిగిన విధ్వంసంతో మరోసారి అలాంటి ఆయుధాల జోలికి పోకూడదనే ఒప్పందానికి కూడా వచ్చాయి ప్రపంచ దేశాలు కానీ, అంతలోనే ఏమి అయిందో ఎవరికి వారు సొంత అణుఆయుధాలు ఏర్పాటు చేసుకుంటూనే ఉన్నారు. కిమ్ నుండి అమెరికా దాకా, అంతెందుకు తినేందుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు, పొట్టకు కూడు లేదు కానీ అణు ఆయుధాలు ఉన్న పాక్ లాంటి దేశాలు బోలెడు తయారయ్యాయి.

అయితే మూడో ప్రపంచ యుద్ధం వస్తే మటుకు ఈ అణు ఆయుధాలతో భూమి కనీసం జీవించడానికి కూడా పనికి రాకుండా పోతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గర అన్నేసి అణు ఆయుధాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ చక్కగా దాచేసుకొని, బైటికి శాంతి మాత్రం చెప్తున్నారు వీళ్ళందరూ. అయితే ఈ సారి ప్రపంచ యుద్ధం ఎవరు మొదలుపెడతారు అనేది ముఖ్యం. ఎవరైనా మొదలు పెడితే బాగుండు, అని అనుకునే వాళ్ళు కూడా తయారయ్యారు ఈ భూమి మీద. అణు ఆయుధాలు తయారీ అయితే చేశారు కానీ దానిని పరీక్షించాలి కదా.. అందుకే మూడో ప్రపంచ యుద్ధం అంటే అందరికి అంత ఆసక్తి.  ఎప్పుడెప్పుడు తమ ఆయుధాలు పరీక్షించుకోవచ్చు అనేది వాళ్ళ కుతూహలం. దానివలన ఎంత నష్టం జరిగిన వాళ్లకు అనవసరం.

అయితే ఈ సారి ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అది సాంకేతికతను సాంకేతికతను మధ్య జరుగుతుంది తప్ప, అణు ఆయుధాలతో కాదనేది నిపుణుల అభిప్రాయం. తాజాగా దీనిపై చర్చలు జరుగగా, ఈసారి ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అది ఏలియన్స్ తో మాత్రమే అనేది వాళ్ళ అభిప్రాయం. తాజాగా దీనిని బలపరుస్తూ, యూఎస్ మిలిటరీ ఆఫీసర్ రాబర్ట్ సలాస్ గ్రహాంతర వాసులు అణు ఆయుధాలను టాంపరింగ్ చేస్తున్నట్టు తెలిపారు. దానిని వాళ్ళు టాంపరింగ్ చేస్తుండగా తాను గమనించినట్టు ఆయన చెప్తున్నారు. అంటే ఈసారి యుద్ధం మనుషులకు, ఏలియన్స్ కు అని ఆయన అంటున్నారు. గ్రహాంతర వాసులు అణు ఆయుధాల వద్దకు వచ్చి ఆయా లక్ష్యాలను తారుమారు చేసి వెళ్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే అవి కొన్ని క్షిపణులను యాక్టీవ్ కూడా చేశాయని, అలాగే పది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను నిర్వీర్యం చేసినట్టు ఆయన పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: