ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త కొద్ది రోజులుగా టీడీపీ, వైసీపీ నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధం.. పార్టీ కార్యాల‌యాలు దాడికి, అరెస్టుల త‌తంగం జ‌రిగిన విష‌యం విధిత‌మే. అయితే తాజాగా ఏపీలో నిర్వ‌హించిన పోలీస్ అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌ల్లో సీఎం జ‌గ‌న్ పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా ఆగ్ర‌హంతో, ఆవేశంతో  జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  

సాక్షాత్తు రాష్ట్ర ముఖ్య‌మంత్రిని బూతులు తిట్ట‌డం.. అత‌ని త‌ల్లిని తిట్ట‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. ఇది నా ఒక్క‌డి మీద జ‌రుగుతున్న దాడి కాదు.. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రిపై జ‌రుగుతున్న దాడి అని తేల్చిచెప్పారు. నేరగాళ్లు త‌మ రూపాన్ని మార్చుకుంటూ అసాంఘిక శ‌క్తులుగా  రాజ‌కీయ నాయ‌కులు ఎదుగుతున్నార‌ని ఎద్దేవా చేశారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కులు కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డమే కాకుండా యువ‌త భ‌విష్య‌త్‌ను దెబ్బ‌తీసేందుకు య‌త్నిస్తున్నారు. ప్ర‌తి విష‌యంలో అబ‌ద్దాలు, అస‌త్యాలు మాట్లాడి వివాదాలు సృష్టిస్తున్నార‌ని పేర్కొన్నారు. బావోద్వేగానికి గుర‌య్యారు సీఎం. సంఘ విద్రోహ శ‌క్తుల‌పై పోలీసులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాలి.  మాద‌క ద్ర‌వ్యాల‌పై వారు చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను డీజీపీ అస‌త్యం అని చెప్పినా విన‌కుండా డీజీపీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

అదేవిధంగా డ్ర‌గ్స్‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సంబంధంలేద‌ని విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్ చెప్పినా వారు ఇష్టం వ‌చ్చిన‌ట్టు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఇటీవ‌ల‌ గుజ‌రాత్‌లో ల‌భించిన డ్ర‌గ్స్‌కు ఏపీకి ఎలాంటి సంబంధం లేద‌ని డీఆర్ఐ, డీజీపీలు వెల్ల‌డించార‌ని గుర్తుచేశారు. డ్ర‌గ్స్ ఆంధ్ర‌లోనే ఉత్ప‌త్తి అవుతున్నాయ‌ని అస‌త్య‌ప్ర‌చారం చేస్తూ ప‌రువు తీస్తున్నార‌ని మండిప‌డ్డారు. రాష్ట్ర ప‌రువుతో పాటు పిల్ల‌ల భ‌విష్య‌త్‌ను నాశ‌నం చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిష్ట‌ను రోజురోజుకు దిగ‌జార్చుతున్నారు. మ‌హిళ‌లు, చిన్న‌పిల్ల‌లకు సంబంధించి లాఅండ్ ఆర్డ‌ర్ విష‌యంలో రాజీప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని వెల్ల‌డించారు. అధికారం ద‌క్క‌లేద‌నే అక్క‌సుతో కులాల మ‌ధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్ర‌హం అయ్యారు. రాష్ట్రంలో ఇలా అరాచ‌కాలు సృష్టించి.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీనికి తోడు దీక్ష‌లు చేప‌డుతున్నార‌ని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: