అవంతి శ్రీనివాస్...ఏపీ మంత్రి..విశాఖ రాజకీయాల్లో కీలకమైన నాయకుడు. ఇంతవరకు ఓటమి ఎరగని నేత. అవంతి విద్యాసంస్థల యజమాని అయిన అవంతి అసలు పేరు ముత్తంశెట్టి శ్రీనివాస్...అయితే విద్యాసంస్థల పేరు బట్టి అవంతి శ్రీనివాస్‌గా అందరికీ తెలిశారు. ఇక అందరికీ తెలిసిన అవంతి..2009 ఎన్నికల్లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఇక ఈయన రాజకీయ గురువు ఎవరో అందరికీ తెలుసు. గంటా శ్రీనివాసరావు ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు

2009 ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ తర్వాత ప్రజారాజ్యం...కాంగ్రెస్‌లో విలీనం కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇక 2014 ఎన్నికల ముందు గంటాతో పాటే టీడీపీలో చేరారు. ఆ ఎన్నికాల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీకి షాక్ ఇచ్చి వైసీపీలో చేరిపోయారు. ఆ ఎన్నికల్లో భీమిలి నుంచి మరొకసారి పోటీ చేసి సత్తా చాటారు. వరుసగా పార్టీలు మారినా సరే అవంతిని విజయాలు వరించాయి.

అయితే విశాఖ వైసీపీలో అనేక మంది సీనియర్లు ఉన్నా సరే జగన్..అవంతికి మంత్రి పదవి ఇచ్చారు. అలా మంత్రిగా అవంతి కొనసాగుతున్నారు. మంత్రి అయ్యాకే అవంతి ప్రత్యర్ధులకు ఎక్కువ టార్గెట్ అయ్యారు. ఆయనని ఎక్కడకక్కడ నెగిటివ్ చేయడానికే చూస్తూ వచ్చారు. కాకపోతే అవంతి కూడా మంత్రిగా పెద్దగా సక్సెస్ కాలేకపోయారనే చర్చ కూడా వచ్చింది.

మంత్రిగా అద్భుతమైన పనితీరు ఏమి కనబర్చలేదనే తెలుస్తోంది. ఇలాంటి సమయంలోనే అవంతికి సంబంధించిన కొన్ని ఆడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంకా క్లిప్‌లు ఏంటో అందరికీ తెలిసిందే. దీంతో అవంతికి నెగిటివ్ పెరిగింది. అవి తనవి కాదని చెప్పిన, ప్రత్యర్ధి పార్టీలు అవే పట్టుకుని నెగిటివ్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా టీడీపీ, జనసేనలు అవంతిని బాగా టార్గెట్ చేశాయి. ప్రతిసారి ఆ ఆడియో క్లిప్‌లకు సంబంధించి ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నారు. ఇలా ప్రతిసారి అవంతిని కార్నర్ చేస్తూనే వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: