టీడీపీ అధినేత‌, 14 సంవ‌త్స‌రాల ముఖ్య‌మంత్రి అని చెప్పుకొనే చంద్ర‌బాబుకు, వైసీపీ అధినేత‌, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు చాలా తేడా ఉంద‌ని అంటున్నారు మేధావులు. చంద్ర‌బాబు హ‌యాంలోనే జ‌ర‌గాల్సిన కొన్ని ప‌నుల‌ను ఆయ‌న పిరికిత‌నంతో వాయిదా వేసుకున్నార‌ని.. కానీ, ఇప్పుడు వాటినే జ‌గ‌న్ అమ‌లు చేస్తున్నార‌ని చెబుతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు.. చెత్త‌పై ప‌న్ను విధింపు, విద్యుత్ చార్జీల పెంపు, శాశ్వ‌త గృహ‌/స్థ‌ల హ‌క్కు, మ‌రుగు దొడ్ల‌పైప‌న్ను విధింపు వంటివాటిని వారు ప్ర‌స్తావిస్తున్నారు.

వాస్త‌వానికి చంద్ర‌బాబు ఉమ్మ‌డి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడే.. చెత్త‌పై ప‌న్ను విధించే కార్య‌క్ర‌మాన్ని తెర‌మీద‌కి తెచ్చార‌ని అంటున్నారు. అయితే.. అప్ప‌ట్లో.. ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌నే ఉద్దేశంతో ఆయ‌న ఈ కార్య‌క్ర‌మాన్ని నాన్చి పెట్టార ని.. చెబుతున్నారు. కానీ, ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు సాధ‌క బాధ‌కాలు వివ‌రిస్తూ.. అదే కార్య‌క్ర‌మాన్ని జ‌గ‌న్ అమ‌లు చేస్తున్నార‌ని అంటున్నారు. ఇక‌, విద్యుత్ చార్జీల పెంపు విష‌యం కూడా 2017లో చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌య‌మేన‌ని అంటున్నారు.

డిస్కంల‌కు వ‌స్తున్న‌న‌ష్టాల‌ను భ‌ర్తీ చేసేందుకు చంద్ర‌బాబు ట్రూ అప్ చార్జీల పేరుతో చార్జీల‌ను పెంచేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని.. కానీ, అప్ప‌ట్లో మ‌ళ్లీ ప్ర‌జావ్య‌తిరేక‌త వ‌స్తుంద‌నే ఉద్దేశంతో వెన‌క్కి త‌గ్గార‌ని.. ఇది వాస్త‌వ‌మేన‌ని .. విద్యుత్ రంగ నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే.. ఎన్నాళ్లు డిస్కంల‌ను అప్పుల్లో ఉంచుతార‌నే ఉద్దేశంతో జ‌గ‌న్ సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు.

ఇక‌, ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు జ‌గ‌న‌న్న శాశ్వ‌త భూహ‌క్కు ప‌థ‌కం కూడా ఎప్పుడో అమ‌లు చేయాల్సి ఉంద‌ని.. దీనిలో నాబార్డు నిధులు కూడా ఉన్నాయ‌ని.. ప్ర‌జ‌ల‌కు అప్పులు చేసి ఇళ్లు క‌ట్టించింది వాస్తవం కాదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. అయితే.. ఆ అప్పులు తిరిగిచెల్లించాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోలేద‌ని.. ఫ‌లితంగా ప్ర‌జ‌లు వారు ఉంటున్న ఇంటిపైనే వారికి హ‌క్కులేకుండా పోయింద‌ని.. ఇప్పుడు జ‌గ‌న్ దీనిని ప‌రిష్క‌రించేందుకు కీల‌క అడుగు వేశార‌ని.. ప్ర‌జా వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని ఆయ‌న తెలిసినా.. సాహ‌సోపేతంగా నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ని.. ఓటు రాజ‌క‌యాల‌కు దూరంగా ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న ముందుకు సాగుతున్నార‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: