జగన్ సర్కారుపై టీడీపీ అనేక రకాలుగా యుద్ధాలు చేస్తుంటుంది.. టీడీపీ అనేది ఓ సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీ.. ఆ పార్టీకి ఇప్పటికే కొన్ని వ్యవస్థలు బలంగా పని చేస్తుంటాయి. ఆ పార్టీకి అన్ని విభాగాలు బలంగా ఉంటాయి. వాటి ద్వారా తరచూ వైసీపీ సర్కారుపై విమర్శల దాడి చేయిస్తుంటాయి. టీడీపీ ఇప్పటికే మీడియాను బలంగా మోహరిస్తుందన్న సంగతి తెలిసిందే.. ప్రధాన తెలుగు పత్రికలు జగన్ వ్యతిరేక ధోరణితో నడుస్తుంటాయన్న సంగతీ తెలిసిందే.


ఇప్పుడు కొత్తగా టీడీపీ జగన్ పైకి బాలయ్యను ప్రయోగిస్తున్నారు. బాలయ్యను అంటే రాజకీయంగా కాదు.. హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ తాజాగా అఖండ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లా విజయవంతంగా ఆడుతోంది. అయితే.. జగన్ సర్కారు ఇటీవల బెనిఫిట్ షోలను రద్దు చేసిన  సంగతి తెలిసిందే. బెనిఫిట్ షోలు అంటే.. సర్కారు నిర్ణయించిన ధర కంటే అధికంగా టికెట్లు అమ్ముకోవడం అన్నమాట.. వాస్తవానికి ఈ బెనిఫిట్ షోలు కొన్ని స్వచ్ఛంద సంస్థలకు బెనిఫిట్ చేయడం కోసం అన్న ఉద్దేశ్యంతో ప్రారంభం అయ్యాయి.


కానీ వాస్తవంలోకి అలాంటి బెనిఫిట్ సదరు స్వచ్ఛంద సంస్థలకు జరగడం లేదు. థియేటర్లే తమ బెనిఫిట్ కోసం అదనపు షోలు వేస్తుంటాయి. దీన్ని ఇటీవల ఏపీ సర్కారు అడ్డుకుంది. బెనిఫిట్ షోలను రద్దు చేసింది. అయితే... ఏవైనా స్వచ్చంధ సంస్థలు నేరుగా ప్రభుత్వాన్ని సంప్రదిస్తే వాటికి వెసులుబాటు కల్పిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఇప్పుడు ఈ బెనిఫిట్ షోల అంశం జగన్ సర్కారుకు బాలయ్య ఫ్యాన్స్‌కు మధ్య జగడానికి కారణమైంది.


బాలయ్య నటించిన అఖండ సినిమాకు చాలా చోట్ల అనుమతులు లేకపోయినా బెనిఫిట్ షోలు వేశారు థియేటర్ల యజమానులు.. అసలే జగన్ సర్కారు.. తమ మాట వినికపోతే ఊరుకుంటుందా.. సమాచారం అందిన థియేటర్లను ఏకంగా సీజ్ చేసి పారేసింది. దీంతో ఆయా థియేటర్ల వద్ద బాలకృష్ణ అభిమానులు గొడవ చేయడం ప్రారంభించారు. అఖండ ధియేటర్ల వద్ద ఆందోళనలు, ధర్నా చేయడం ప్రారంభించారు. అలా జగన్ పైకి బాలయ్యను ప్రయోగించారన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: