అయ్యన్నపాత్రుడు అంటే టీడీపీకి వీర విధేయుడు అని చెప్పొచ్చు. పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న నేత. రాజకీయాల్లో ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా సరే...ఎప్పుడూ కూడా పార్టీని వీడాలని అనుకోలేదు. ఎలాంటి సమయంలోనైనా పార్టీకి అండగానే నిలబడ్డారు. ఇలా పార్టీకి అండగా ఉంటున్న అయ్యన్నని దెబ్బకొట్టడానికి ప్రత్యర్ధులు నానా రకాల ప్రయత్నాలు చేశారు. ఆయన లొంగకపోతే ఫ్యామిలీని లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు.

ఈ క్రమంలోనే ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడుని వైసీపీ తిప్పేసుకుంది. అయినా సరే అయ్యన్న క్రుంగిపోకుండా పార్టీ కోసం నిలబడుతూ వచ్చారు. ఇదే క్రమంలో అయ్యన్న వారసుడు విజయ్‌ని సైతం దగ్గర చేసుకోవడానికి వైసీపీ ప్రయత్నించిందని తెలిసింది. గత ఎన్నికల్లో విజయ్‌కు ఎంపీ సీటు ఇస్తామని వైసీపీ ఆఫర్ చేసిందని తెలిసింది. కానీ ఆ ప్రపోజల్‌ని విజయ్ నిర్మొహమాటంగా తిరస్కరించారట.

అయితే టీడీపీ బలోపేతం కోసం అయ్యన్న ఎంత కష్టపడుతున్నారో విజయ్ కూడా అంతే కష్టపడుతున్నారు. పార్టీ తరుపున బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయాక ఎవరూ బయటకొచ్చి మాట్లాడని సమయంలో కూడా అయ్యన్న, విజయ్‌లు డేర్‌గా బయటకొచ్చి మాట్లాడారు. ఇక ఇలా పార్టీ కోసం కష్టపడుతున్న ఫ్యామిలీకి నెక్స్ట్ ఎన్నికల్లో రెండు సీట్లు ఇస్తే బెటర్ అనే అభిప్రాయం పార్టీ శ్రేణుల నుంచి వస్తుంది. ఇప్పటిలో అయ్యన్న...నర్సీపట్నం సీటు వదలడం కష్టం. అలాంటప్పుడు విజయ్‌కు ఏదైనా పార్లమెంట్ సీటు ఇస్తే బెటర్ అని అంటున్నారు. అయ్యన్న సైతం..తన తనయుడుకు పార్లమెంట్ సీటు అయితేనే సూట్ అవుతుందని చెబుతున్నారు.

అయితే విశాఖలో ఇప్పుడు అనకాపల్లి ఎంపీ సీటు ఖాళీగానే ఉంది. గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి ఆడారి ఆనంద్ ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో ఆ స్థానానికి నాయకుడు లేకుండా పోయారు. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి సీటులో ఎవరు పోటీ చేస్తారనేది క్లారిటీ రావడం లేదు. కాకపోతే ఆ సీటు విజయ్‌కు ఇస్తే బాగుంటుందని, పార్టీ గెలవడం సులువు అవుతుందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. మరి చూడాలి అయ్యన్న వారసుడుకు సీటు ఫిక్స్ చేస్తారో లేదో..?

మరింత సమాచారం తెలుసుకోండి: