ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలకు సంబంధించి కాస్త ఇబ్బందికర వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కొంత మంది ఉద్యోగ సంఘాల నాయకులు ఇబ్బందికరంగానే వ్యవహరిస్తున్నారు. ఉద్యోగుల సమస్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో చాలామంది ఉద్యోగ సంఘాల నాయకులు ఈ మధ్యకాలంలో విమర్శలు చేయడం రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకొని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వంటివి జరుగుతున్నాయి. కొంత మంది ఉద్యోగ సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేసుకుని అనవసరంగా గెలిపించాలని బాధపడటం కాస్త హాట్ టాపిక్ గా మారింది.

రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని కొన్ని విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉన్నాసరే ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందికరంగా వ్యవహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ఉద్యోగ సంఘాల నాయకుడు బండి శ్రీనివాసరావు ఈ మధ్య కాలంలో చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కొన్ని కొన్ని అంశాల్లో సీరియస్ గానే ఉండాలి. ఉద్యోగుల సమస్యలకు సంబంధించి అలాగే ఒకటో తారీకు జీతాలు రాక పోవడం గురించి అదేవిధంగా పిఆర్సి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పు పడుతున్నారు.

దీనికి సంబంధించి ఇటీవల అనవసరంగా గెలిపించామని మాయమాటలు నమ్మి గెలిపించాం అని చెప్పడం పట్ల కాస్త రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు సీరియస్ గా ఉన్నాయి. అయితే బండి శ్రీనివాసరావుకి ఉద్యోగ సంఘాల నాయకులు నుంచి ఎటువంటి సహకారం లేదని వ్యాఖ్యలు కూడా కాస్త గట్టిగానే వినబడ్డాయి. ఉద్యోగ సంఘాల్లో ఇప్పుడు బండి శ్రీనివాసరావు వైఖరికి సంబంధించి సీరియస్ గా ఉన్నారని ఆయన విపక్షాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వారిలో ఉందని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల మీద విమర్శలు చేయడానికి ఆయన వెనుక కొంత మంది తెలంగాణ ఉద్యోగులు ఉన్నారని ఆరోపణలు రావడం కాస్త విస్మయానికి గురిచేస్తున్న అంశం.దీనిపై త్వరలో ఒక క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: