తెలంగాణ రాజకీయాలు ఆసక్తికర  మలుపులు తిరుగుతున్నాయి. వచ్చే ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎలాగైనా అధికారం సాధించాలని కాంగ్రెస్ గట్టిగా పోరాడుతోంది. కాగా తెలంగాణ రాష్ట్రంలో అధికారమే టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన హస్తం పార్టీ ఏపీలో తమకు పూర్తి వ్యతిరేకం వస్తుందని తెలిసినప్పటికీ, తెలంగాణలో అధికారం దక్కుతుందనే భావనతో రాష్ట్ర విభజన ప్రక్రియకు కాంగ్రెస్ పార్టీ జెండా ఊపింది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆశయం మాత్రం నెరవేరలేదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో  కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికే పరిమితం అయింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 2018  ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం గులాబీ పార్టీ గూటికి చేరుకున్నారు. దీంతో హస్తం పార్టీ భవిష్యత్తు కూడా ఆగమ్యగోచరంగా మారిపోయింది. చివరికి నాయకత్వం మార్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డిని నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ,ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. దేశంలో ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూనే ఉన్నాయి. ఇక భూసంస్కరణలే ప్రధానాస్త్రాలుగా ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు పిసిసి నేతలు. చేవెళ్ల నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు.

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు కూడా. చేవెళ్ల మండలం మూడిమ్యాల చౌరస్తా నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఖమ్మం పట్టణంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సంగారెడ్డి పట్టణంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా పాదయాత్ర చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారమే టార్గెట్ గా హస్తం పార్టీ తమ పావులు కదుపుతోంది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు రేవంత్ సారధ్యంలోని హస్తం పార్టీ అస్త్రాలు సిద్ధం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: