రెండేళ్ల నుండి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ మనుషుల స్థితిగతుల్ని ఎంతగా మార్చిందో తెలిసిందే. ఇంత కాలం అవుతున్నా ఈ మహమ్మారికి ఈ భూమి నుండి వెళ్ళాలనే ఆలోచన ఏ మాత్రం రావడం లేదు. అయినా ఏది శాశ్వతంగా ఉండిపోదు. అందరూ దైర్యంగా అలాగే అప్రమత్తంగా ఉండాలి.  కాగా ఇప్పుడు ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలలో వేగంగా విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తోంది. ఈ వార్తల గురించి మీడియాలోనూ బాగా ప్రచారం అవుతుండటంతో మరింత కంగారు పడుతున్నారు ప్రజలు. అయితే తాజాగా వినిపిస్తున్న వార్త కాస్త ఉరట కలిగిస్తోంది. ప్రస్తుతం  వేగంగా చాప కింద నీరులా ఒమిక్రాన్ విస్తరిస్తూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది.

ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాప్తి వేగం పుంజుకుంది. అయితే ఇప్పటి వరకు వచ్చిన నివేదికల ఆధారంగా  కరోనా సెకండ్ వేవ్ లో డెల్టా వైరస్ కంటే  ఒమిక్రాన్ ప్రభావం పెద్దగా లేదని, వేగంగా విస్తరిస్తోంది కానీ అంత తీవ్రత కనిపించడం లేదని పలువురు వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్ నిర్దారణ అయిన వారిలో అతి తక్కువ మంది మాత్రమే హాస్పిటల్స్ లో చేరుతున్నారని అంటున్నారు. రానున్న రోజుల్లో ఇలాగే ఒమిక్రాన్ ప్రభావం మరింత తగ్గితే సహజ టీకాగా ఒమిక్రాన్ పనిచేసే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

అయితే పూర్తి క్లారిటీ వచ్చే వరకు జాగ్రత్త తప్పనిసరి అన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మరి ఎన్ని కేసులు పెరిగినా, మీడియాతో సోషల్ మీడియాలు ఎంత రచ్చ చేసినా మనము కరోనా జాగ్రత్తలు తీసుకున్నంత కాలం ఎటువంటి ప్రమాదం లేదు. అవసరం అయితే తప్పించి బయటకు వెళ్లకుండా ఉండాలి. ఒకవేళ వెళ్లినా ఎటువంటి పరిస్థితుల్లోనూ ముఖానికి మాస్క్ ను తీసివేయ కూడదు. అలాగే బయట వెళ్ళినప్పుడు ఎక్కడ ఏది తాకినా శానిటైజర్ ను వాడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: