సింహాద్రి అప్పన్నను ఇవాళ దర్శించుకున్నారు శ్రీ శరదాపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర స్వామి. ఈ సందర్భంగా  ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు అధికారులు. అనంతరం గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు స్వరూపానందేంద్ర స్వామి. ముందుగా సంక్రాంతి సంబరాలలో భాగంగా భోగి మంటలు వెలిగించి ప్రారంభించారు స్వరూపానందేంద్ర స్వామి. అనంతరం స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ...ఈ సారి భోగి, సంక్రాంతి, కనుమకు ముందురోజు వైకుంఠ ఏకాదశి రావడం ఎంతో అదృష్టం అన్నారు. అదేవిధంగా భోగి మంటలు ఈ మంచి సమయంలో ప్రారంభించడం మహాత్భాగ్యంగా భావిస్తున్నాం..ముఖ్యంగా ఈ భోగి, సంక్రాంతి కనుమ పండుగను రైతుల పండుగగా చెప్పుకుంటామని వెల్లడించారు స్వరూపానందేంద్ర స్వామి.. 

రైతులు పండించిన పంటలు బాగా పండితే ముందుగా ఆ సింహాద్రి అప్పనకే సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది..
విశాఖ శారదాపీఠం యొక్క ఇల దేముడు ఆ సింహాద్రి అప్పన్నే పేర్కొన్నారు స్వరూపానందేంద్ర స్వామి... ఈ మూడు పండుగలు వొచ్చాయంటే ఇక నుంచి ఉత్తరాయణంలో అడుగు పెడుతున్నట్లుగానే భావించాలి. వివాహాది శుభకార్యాలకు మంచిరోజులుగా చెప్పుకుంటామన్నారు స్వరూపానందేంద్ర స్వామి. అప్పన్న దేవాలయంలో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు   శ్రీ శరదాపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర స్వామి...


జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ మురళీధర శర్మ మృతిపై స్పందించిన స్వరూపానందేంద్ర స్వామి..  జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ మురళీధర శర్మ పరమపదించడం విచారకరమన్నారు. వ్యాకరణశాస్త్రం లో ఆయన  దిట్ట అని.. తిరుపతిలో సంస్కృత విద్యాపీఠం సర్వతోముఖాభివృద్ధికి ఆయన కృషి ఎనలేనిదన్నారు  శ్రీ శరదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర స్వామి.. విశాఖ శ్రీ శారదాపీఠంమంటే ఆయనకు ఎంతో గౌరవమని.. పీఠం ముద్రించిన గ్రంధాలు ప్రాచుర్యం పొందడానికి ఆయన సహకారం అపూర్వమని పేర్కొన్నారు. విశాఖ శ్రీ శారదాపీఠం ఏటా నిర్వహించే శాస్త్రసభల్లో మురళీధరశర్మ పాల్గొనేవారన్నారు  శ్రీ శరదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర స్వామి.
మరింత సమాచారం తెలుసుకోండి: