ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీలోకి కీల‌క మాజీ నాయ‌కులు ప్ర‌వేశించ‌నున్నారా? పార్టీ తీర్థం తీసుకునేందుకురెడీ అవుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు జ‌న‌సేన కీల‌క నాయ‌కులు. ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు కృషి చేస్తున్నాన‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ క‌లిసి రావాల‌ని.. ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌దే ప‌దే చెబుతున్నారు. ఈ క్ర‌మంలో పార్టీలోనూ.. సంద‌డి నెల‌కొంది. మ‌రీ ముఖ్యంగా టీడీపీతో పొత్తు పెట్టుకునే దిశ‌గా పార్టీ అడుగులు వేస్తోంద‌నే వాద‌న కూడా బ‌ల‌ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ఏపార్టీలోనూ చేర‌ని చాలా మంది సీనియ‌ర్ నాయ‌కులు.. ఇప్పుడు జ‌న‌సేన‌వైపు చూస్తున్నార‌ని తెలుస్తోంది.

అదేస‌మ‌యంలో రాజ‌కీయంగా త‌ట‌స్థంగా ఉన్న వారు కూడా.. జ‌నసేన వైపు చూస్తున్నార‌ని అంటున్నా రు. వీరిలో జ‌న‌సేన మాజీ నాయ‌కులు.. సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌, రాజ‌మండ్రి మాజీ ఎంపీ, విశ్లేష‌కులు.. ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌, క‌డ‌ప జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డి.. వంటివారు జ‌న‌సేన దిశ‌గా అడుగులు వేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇక‌, మ‌రికొంద‌రు దిగువ శ్రేణి నాయ‌కులు కూడా జ‌న‌సేన వైపు చూస్తున్నార‌ని స‌మాచారం.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో క‌ల‌వడం ద్వారా. . పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నాలు పెరుగుతున్న నేప‌థ్యంలో నాయ‌కులు లెక్క‌లు వేసుకుంటున్నారు. అదే.. ఒంట‌రి పోరుకానీ, బీజేపీతో క‌లిసి ముందుకు వెళ్ల‌డం కానీ, జ‌రిగితే.. నాయ‌కుల ప‌రిస్థితి వేరేగా ఉండేది. కానీ, అలాకాకుండా.. టీడీపీతొ పొత్తు పెట్టుకుంటే.. పార్టీ పుంజుక‌నే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నాలు వ‌స్తున్నాయి. దీంతో చాలా మంది నాయ‌కులు.. జ‌న‌సేన వైపు చూస్తున్నారు.

ఇటీవ‌ల‌.. పార్టీ కీల‌క నాయ‌కుడు.. నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా కీల‌క వ్యాఖ్య‌లుచేశారు. ప‌వ‌న్ నాయ‌క‌త్వాన్ని కోరుకునేవారు..పార్టీలోకి వ‌స్తే.. ఎప్పుడైనా.. ఎవ‌రినైనా ఆహ్వానిస్తామ‌ని చెబుతున్నారు.  దీంతో పార్టీ ఎవ‌రు వ‌చ్చినా.. తీసుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తుండ‌డంతో వ‌చ్చేవారిలోనూ హుషారు పెరిగింది. మ‌రి రాబోయే రోజుల్లో ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: