సీఎం జ‌గ‌న్‌ను మెప్పించ‌డం అంటే మాట‌లు కాదు. మాట‌ల‌కు ఆయ‌న లొంగ‌డు. పొగ‌డ్త‌ల‌కు కూడా ప‌డిపోడు. మ‌రి అలాంటి ముఖ్య‌మంత్రిని ఒక ఎమ్మెల్యే బాగా ఆక‌ట్టుకున్నారు. అంతేకాదు.. ముఖ్య‌మంత్రి నిత్యంఆయ‌న‌తో మాట్లాడేలా చేసుకున్నారు. సీఎం త‌న ఇంట్లో ఏ కార్య‌క్ర‌మం త‌లపెట్టినా.. ఈ ఎమ్మెల్యే ఉండందే ప‌ని జ‌ర‌గ‌దు.. అన్న విధంగా ప‌రిస్థితి మారిపోయింది. ఆయ‌నే చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి. తాడేప‌ల్లిలోని.. సీఎం నివాసంలో ఏం కావాల‌న్నా.. క్ష‌ణాల్లో ఏర్పాటు చేస్తున్న నేత‌గా ఆయ‌న సీఎం ద‌గ్గ‌ర మంచిమార్కులు కొట్టేశారు. ఒక స్వామీజీ చెప్పార‌ని చెప్పి.. సీఎం నివాసంలో గోశాల‌ను ఏర్పాటు చేశారు.

అంతేకాదు.. ప్ర‌తి వారం ఒక‌సారి.. ఇక్క‌డ‌కు వ‌చ్చి.. గోశాల బాగోగుల‌ను , ప‌ర్య‌వేక్ష‌ణ‌ను కూడా ఎమ్మెల్యేనే చూసుకుంటున్నారు. తాజాగా సంక్రాంతి సంబ‌రాలు జ‌రిగాయి. తాడేప‌ల్లిలోని నివాసంలో జ‌గ‌న్ దంప‌తు లు ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఎంతో అట్ట‌హాసంగా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మాన్ని మొత్తాన్ని ఎమ్మెల్యేచెవిరెడ్డే.. ద‌గ్గ‌రుండి చూసుకోవ‌డం విశేషం. ఈ సంబ‌రాల్లో ప్ర‌తి కార్య‌క్ర‌మం కూడా ఎమ్మెల్యే చెవిరెడ్డి స్వ‌యంగా శ్ర‌ద్ధ తీసుకుని మ‌రీ.. సీఎం జ‌గ‌న్‌ను మెప్పించేలా.. ఆయ‌న మెచ్చుకునేలా ఏర్పాట్లు చేశారు.

గంగిరెద్దుల వాళ్ల‌ను స్వ‌యంగా త‌న నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెప్పించారు. అదేవిధంగా హైద‌రాబాద్ నుంచి.. ప్ర‌ముఖ సింగ‌ర్‌.. సోద‌రీ మ‌ణుల‌ను కూడా ర‌ప్పించారు. ఈ సంద‌ర్భంగా తాను స్వ‌యంగా రాసిన‌.. సంక్రాంతి గీతాన్ని వారితో పాడించారు. ఇలా.. అన్ని కార్య‌క్ర‌మా ల‌ను త‌న క‌నుస‌న్న‌ల్లోనే న‌డిపించారు చెవిరెడ్డి. దీంతో సీఎంతెగ సంతోష ప‌డిపోయారు. చెవిరెడ్డిని మెచ్చుకున్నారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు.. ఇదే విష‌యం .. చెవిరెడ్డి అనుచ‌రుల మ‌ధ్య చ‌ర్చ‌గా మారింది. ఆయ‌న కోరిక ఫ‌లిస్తుందా? అంటూ.. వారు చ‌ర్చించుకుంటున్నారు.

మంత్రి కావాల‌నేది చెవిరెడ్డి ఆశ‌యంగా చెబుతున్నారు. పార్టీకోసం.. ఆయ‌న ఎంతో శ్ర‌మిస్తున్నార‌ని.. చివ‌ర‌కు పండుగ‌ల స‌మ‌యంలో అంద‌రూ కుటుంబాల‌తో సంబ‌రాలు చేసుకుంటే.. చెవిరెడ్డి మాత్రం కుటుంబాన్ని కూడాదూరం పెట్టి.. సీఎం కోసం.. ఎంతో చేస్తున్నార‌ని.. కాబ‌ట్టి ఆయ‌న‌కు ఇప్పుడైనా.. మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుందా? అనే చ‌ర్చ చేస్తున్నారు. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: