రాజన్న సిరిసిల్ల జిల్లా :   వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి స్వాగతం పలికారు వేముల వాడ ఆలయ అధికారులు. భక్తుల సమస్యలను ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. అనంతరంత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. నాస్తికుల రాజ్యాంగ తెలంగాణ మారిపోయిందని మండి పడ్డారు. సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం 400 కోట్లు కేటాయిస్త అన్నాడు...ఊహ చిత్రాలు మాత్రమే చూపించాడన్నారు బండి సంజయ్. 

మేడారం జాతర కంటే ముందుగా రాజన్న ను దర్శించుకోవడం ఆనవాయితీ కానీ భక్తుల సౌకర్యాల పై ప్రభుత్వం  సమీక్ష చేయక పోవడం బాధాకరం... సీఎం కేసీఆర్ రాజన్న కి ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని ఫైర్‌ అయ్యారు బండి సంజయ్...క్యూలైన్ లో పసి పిల్లలు, వృద్ధులు, దివ్యంగులు ఇబ్బంది పడుతున్నారని..  ఆలయంలో శానిటేషన్ విఫలమని ఆగ్రహించారు బండి సంజయ్. తెలంగాణ వచ్చాక ఇంచార్జి ఈఓ లే ఉన్నారు..ప్లాన్ ప్రకారం ఇంచార్జి ఈఓ లను మరుస్తున్నారు.. రాజన్న ఆలయం పట్ల పేద భక్తుల పట్ల  ప్రభుత్వానికి నిర్లక్ష్యం ఎందుకు.. ? అని ప్రశ్నించారు బండి సంజయ్.ఆనాడు సమైక్యాంధ్ర కాబట్టి వివక్ష అయింది అన్నాడు. మరి తెలంగాణ రాష్ట్ర మే కదా సీఎం గా ఉన్నావ్ ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు బండి సంజయ్. సీఎం కేసీఆర్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది...  రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతి పాదనలు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం తరుపున రాజన్న ఆలయం ను మేము డెవలప్ చేస్తామన్నారు బండి సంజయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: