గత కొన్ని నెలల నుంచి రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో తీవ్రస్థాయిలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఉక్రెయిన్ ను యూరోపియన్ యూనియన్ లో చేరేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో యూరోపియన్ యూనియన్లో చేరడానికి వీలు లేదు అంటూ రష్యా పట్టుబట్టింది. ఈ క్రమంలోనే ఏకంగా ఉక్రెయిన్ తో యుద్ధం చేసి ఇక ఆ దేశాన్ని మొత్తం తమ దేశంలో కలుపుకోవడానికి రష్యా ఎన్నో కుట్రలు చేస్తోం.ది దీంతో గత కొన్ని నెలల నుంచి ఉక్రెయిన్ రష్యా సరిహద్దుల్లో తీవ్రస్థాయిలో ప్రతిష్టంభన కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే.


 అయితే తాము స్వతంత్ర దేశంగానే ఉండాలని అనుకుంటున్నామని రష్యా చేతుల్లో బానిసల్లా బ్రతికేందుకు సిద్ధంగా లేము అంటూ ఉక్రెయిన్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా వెనక్కి తగ్గకపోవడంతో రానున్న రోజుల్లో యుద్ధం తప్పదు అనే విధంగానే మారిపోయింది పరిస్థితి. ఇక ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఏ క్షణంలో యుద్ధం తలెత్తిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు అని అర్థమవుతుంది. ఇకపోతే ప్రస్తుతం రష్యా దగ్గర ఉన్న ఆయుధ వ్యవస్థ తో పోల్చి చూస్తే ఉక్రెయిన్ దగ్గర కనీసం సగం ఆయుధ సంపత్తి కూడా లేకపోవడం గమనార్హం.


 దీనికి సంబంధించిన కొన్ని లెక్కలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.  ఉక్రెయిన్ దగ్గర 11 లక్షల మంది సైన్యం ఉంటే అందులో ప్రస్తుతం యాక్టివ్ గా ఉంది రెండు లక్షల 50 వేల మంది సైనికులు. ఇక  రష్యా దగ్గర కోటికి పైగా సైనికులు ఉంటే  ఇక మూడు లక్షలకు పైగా సైనికులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఎటాక్ ఎయిర్క్రాఫ్ట్ ఉక్రెయిన్ దగ్గర 68 ఉంటే రష్యా 1500 పైగా ఉన్నాయట. ఎటాకింగ్ హెలికాప్టర్లు ఉక్రెయిన్ దగ్గర 34 ఉంటే రష్యా దగ్గర 530 ఉన్నాయి. ఇక యుద్ద ట్యాంకులు ఉక్రెయిన్ దగ్గర 400 ఉంటే రష్యా దగ్గర 13,000 ఉన్నాయి స్మాల్ వార్ షిప్స్ 13 ఉక్రెయిన్ దగ్గర ఉంటే.. రష్యా దగ్గర 214 ఉన్నాయి. ఇలా ఇలా రష్యా సైన్యం తో పోల్చి చూస్తే ఉక్రెయిన్ ఎక్కడ సరితుగడం లేదు. కేవలం అమెరికా ఉక్రెయిన్లో సైనికులను మోహరించి యుద్ధం చేస్తే  తప్ప రష్యాతో యుద్ధం చేసేందుకు ఉక్రెయిన్ పనికిరాదు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: