ప్రపంచంలో రోజు రోజుకీ అభివృద్ధి జరుగుతున్న విషయం వాస్తవమే. కానీ కొందరు మాత్రం అభివృద్ధిని మంచి పనులకు వాడుకుంటూ ఉంటే, దాదాపుగా ఎక్కువ మంది చెడు కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా నేటి కాలంలో కంప్యూటర్ ల ద్వారా భారీ మోసాలు జరుగుతున్నాయి. ఎక్కువగా సైబర్ నేరాలు రికార్డ్ అవుతున్నట్లు సైబర్ డిపార్టుమెంటు చెబుతున్న వివరాలను బట్టి తెలుస్తోంది. ఇప్పుడు రిసెంటుగా భాగ్యనగరం లో జరిగిన ఒక పెద్ద సైబర్ ఎటాక్ హాట్ టాపిక్ అయి కూర్చుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఏపీ మహేష్ బ్యాంక్ నుండి రూ. 12.90 కోట్లు మోసం చేసి దోచేసిన ఘటన గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇందులో మొత్తం మూడు కరెంట్ అకౌంట్ లలోకి ఈ మొత్తం అమౌంట్ ను ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత ఈ మొత్తాన్ని 128 మంది వ్యక్తిగత అకౌంట్ లలో కొద్ది మొత్తంలో పంపించి వారి దగ్గర డ్రా చేయించారు. దీనికి వారికి కొంత మొత్తం ముట్ట చెప్పారు. ఇందు కోసం కేవలం డబ్బు అవసరం అయిన వారిని ఎంచుకుని పథకం ప్రకారం పూర్తి చేశారు.

అయితే ఈ ఘటన జరిగిన అనంతరం సీసీఎస్  పోలీసులు ఎలాగైనా ఈ కేసును చేధించడానికి డిసైడ్ అయ్యారు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కే ఒక సవాల్ గా మారింది. అయితే ఇప్పుడిప్పుడే తీగ లాగుతుంటే డొంకంతా కదులుతోంది. ఈ కేసును పూర్తిగా పరిశీలించిన సీసీఎస్ బృందాలకు తెలిసింది ఒక్కటే. ఇది ఆషామాషీ గా జరిగింది కాదు. దీని వెనుక చాలా నెట్వర్క్ జరిగి ఉంటుందని పసిగట్టారు. అందుకు తగినట్లుగానే వీరంతా కొన్ని బృందాలుగా విడిపోయి ఢిల్లీ బెంగళూరు పుణె ముంబై లాంటి రాష్ట్రాలకు వెళ్లి అక్కడ మకాం వేశారు. ఇందుకు ప్రతి ఫలంగా బెంగళూర్ లో ముగ్గురు నిందితులు దొరికారు. వీరిని రిమాండ్ కు తరలించారు. మిగిలిన వారి కోసం వేట కొనసాగుతోంది. త్వరలో ఈ ముఠాలోని నిందితులు అందరినీ అరెస్ట్ చేస్తామని సీసీఎస్ అధికారులు తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: