సిఎం కేసీఆర్ వ్యాఖ్యలపై మాట్లాడుతూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ఫుల్ క్లారిటీ ఇచ్చే దిశగా అపోహలు - వాస్తవాలు పేరిట కేంద్రమంత్రి ఆర్.కె.సింగ్ అంటూ అధికారకంగా ఒక ప్రకటన విడుదల చేసింది. నేరుగా తెలంగాణ సీఎం ను టార్గెట్ చేస్తూ కరెంట్ మీటర్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా కేంద్రం బావుల మోటార్లకు మీటర్లు పెట్టాలని, వ్యసాయ బోర్లు, ఇలా వీటన్నింటి నెత్తిపై పిడుగు వేసిందని ఆరోపణలు చేశారు గులాబీ నేత. కేంద్రం తెచ్చిన విద్యుత్ సంస్కరణలు కనుక దృష్టిలో ఉంచుకుని అమలు చేయగలిగితే పౌల్ట్రీలు, లాండ్రీలు దళితులకు విద్యుత్ రాయితీలు ఇచ్చే అవకాశమే ఉండబోదని చెప్పుకొచ్చారు.
వ్యవసాయ బోర్లు, బావుల వద్ద మోటార్లకు విద్యుత్ మీటర్లు పెట్టమని ఏ రాష్ట్రాన్ని కూడా బలవంతం చేయడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేయలేదని క్లారిటీ ఇచ్చింది. అనవసరంగా కేంద్రాన్ని టార్గెట్ చేయడం వలన ఒరిగేది ఏమి లేదని రాష్ట్రానికి సహకరిస్తు కేంద్రానికి బలంగా మారితే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్ట్రా లను బట్టి వారి వినియోగాలను బట్టి విద్యుత్ ను కొనుగోలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. మొత్తంగా ఒక మాటలో చెప్పాలి అంటే ఆయా రాష్ట్రాలను బట్టి ఎంతగానో యోచించి ఒక ప్రణాళిక ప్రకారం కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి