ఆంధ్రప్రదేశ్ థియేటర్లలో ఆక్యుపెన్సీ ని పెంచడం వలన సినీ ఇండస్ట్రీకి కాస్త ఊరట లభించింది అని చెప్పవచ్చు. కొత్త మూవీస్ విడుదల చేస్తే, సినిమా థియేటర్లలో ఆక్యుపెన్సీ తక్కువ శాతం ఉండడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని ఆందోళన చెందినటువంటి సినీ ఇండస్ట్రీకి శుభవార్తే అని చెప్పవచ్చు. ఏపీ సర్కార్ సినీ ఇండస్ట్రీకి సంతోషం కలిగించే కీలకమైన నిర్ణయం తీసుకున్నది. ఆంధ్రప్రదేశ్లోని సినిమా థియేటర్ల విషయంలో చాలా రోజులుగా చర్చలు సాగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలను  కూడా కొనసాగించారు.

ఆంధ్రప్రదేశ్ థియేటర్లలో ఆక్యుపెన్సీ ని 100 శాతానికి పెంచడంతో పాటుగా సినీ ఇండస్ట్రీకి  కాస్త ఊరట లభించిందని చెప్పవచ్చు. కొత్త మూవీస్ విడుదలైనప్పుడు థియేటర్లు ఆక్యుపెన్సీ పర్సంటేజ్ తక్కువగా ఉండడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని ఆందోళన చెందినటువంటి సినీ ఇండస్ట్రీ కి ఇదొక శుభపరిణామం అని చెప్పవచ్చు. కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు 50% ఆక్యుపెన్సీ మాత్రమే కొనసాగింది. అలాగే రాత్రి సమయంలో కర్ఫ్యూ కూడా ఉండటంతో థియేటర్లలో సెకండ్ షో చూడడానికి అనుమతులు ఉండేవి కావు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కఫ్యూ అమలు సమయం తగ్గింది. ఈనెల 31వ తేదీ నుంచి అర్ధ రాత్రి పన్నెండు గంటల సమయం నుండి తెల్లవారుజామున ఐదు గంటల వరకే మాత్రమే కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలియజేసింది.

 ఆంధ్ర ప్రదేశ్ థియేటర్ లోని సీట్లలో ఒక సీటును వదిలి మరొక సీట్లో కూర్చొని సినిమా చూడాలని కండిషన్ ను ఆంధ్రప్రదేశ్ సర్కార్ తొలగించింది. కరోణ సమయంలో సినిమా థియేటర్లలో సగం సీట్లు మాత్రమే పూర్తిగా భర్తీ అయ్యేవి. దీంతో సినీ ఇండస్ట్రీలో తీవ్రమైన ఇబ్బందులు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకొని పూర్తిస్థాయిలో సీట్లకు అనుమతి ఇచ్చినట్లు తెలియజేసింది. అలాగే వివాహాది శుభకార్యాలకు 250 మంది కంటే ఎక్కువగా రాకూడదని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: