రష్యా దాడులతో ఉక్రెయిన్ లో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఓ తల్లి 10రోజుల వ్యవధిలో చనిపోయిన ఇద్దరు కుమారుల చితికి నిప్పంటించడం కంటతడి పెట్టిస్తోంది. అహాఫియా వవైశకు ఇద్దరు కుమారులు ఉండగా.. వారు ఉక్రెయిన్ సైన్యంలో పనిచేస్తున్నారు. అయితే రష్యా చేసిన మిస్సైల్ దాడుల్లో వీరిద్దరూ కన్నుమూశారు. దీంతో వారి అంత్యక్రియలను నిర్వహించిన తల్లి అహాఫియా.. గుండెలు పగిలేలా రోదించింది.
ఉక్రెయిన్ పై దాడులను రష్యా నానాటికీ తీవ్రతరం చేస్తోంది. ఇప్పటికే పలు నగరాలపై దాడులు చేసిన రష్యన్ ఆర్మీ.. మళ్లీ రాజధాని కీవ్ పై దృష్టి సారించాయి. ఇటీవల సైనిక కర్మాగారంపై దాడి చేసినట్టు రష్యా వెల్లడించింది. తమ భూభాగంపై విధ్వంసానికి పాల్పడాలని చూస్తే కీవ్ పై క్షిపణుల దాడులు మరింత పెరుగుతాయని హెచ్చరించింది. తమ సరిహద్దు నగరాలను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ క్షిపణి దాడులను చేస్తోందని రష్యా ఆరోపించింది.
ఇక తమ మీద తమకు తప్ప ఈ ప్రపంచం మీద తమకు నమ్మకం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. తమ పొరుగు దేశాలపై అసలు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. యుద్ధాన్ని ముగించేందుకు తమ దేశ భూభాగాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. తాను ఈ ప్రపంచాన్ని నమ్మటం లేదన్నారు జెలెన్ స్కీ. రష్యా యుద్ధం తర్వాత తమ పొరుగు దేశాలపై విశ్వాసం లేదని వెల్లడించారు.
అంతేకాదు ఐదు రోజుల్లోనే పని ముగించేస్తామన్న రష్యాను 50రోజులుగా ఎదుర్కొంటున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. దేశ ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఇంకా జీవించి ఉన్నందుకు అందరం గర్వించాలన్నారు. యుద్ధం ఆరంభంలో చాలా మంది మాస్కోనూ ఎదుర్కోలేవనీ.. దేశాన్ని విడిచి వెళ్లాలని సలహా ఇచ్చినట్టు గుర్తు చేశారు. కానీ ఉక్రెయిన్ ప్రజలు ఎంతటి ధీరులో.. అర్థమైందన్నరు. తనకు తన ప్రజలే అసలైన బలం అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి