సాధారణంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడిన సమయంలో ఎన్నో వృక్షాలు నేల కొరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ఏకంగా వందల ఏళ్ల చరిత్ర కలిగిన చెట్లు కూడా భారీ గాలులకు కింద పడిపోవడం లాంటిది జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. దాదాపు రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన రావి చెట్టు ఇటీవలే భారీ గాలులకు కింద పడిపోయింది అని చెప్పాలి. దీంతో ఆ చెట్టును పరిశీలించేందుకు వెళ్లిన స్థానికులు అందరు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే రెండు వందల ఏళ్ల చరిత్ర కలిగిన రావి చెట్టు వేర్ల భాగంలో ఐదు శివలింగాలు బయటపడటం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఇందులో ఒక శివలింగం పెద్దదిగా ఉంటే నాలుగు శివలింగాలు కాస్త చిన్నవిగా ఉన్నాయి. అయితేవీటిని చూసిన గ్రామస్తులు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు అనే చెప్పాలి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ పట్టణంలో వెలుగులోకి వచ్చింది. ముస్తాఫాబాద్ లో వెలుగుచూసింది ఈ ఘటన. అయితే రాగి చెట్టు కింద ఇలా శివలింగాలు బయటపడటంతో అక్కడ శివుడి గుడి నిర్మించేందుకు స్థానికులు ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పాలి.


 ముస్తాఫాబాద్ నివాసి అయిన విజయ్ పాల్ సింగ్ పూర్వీకులు వారి పొలం లో సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఒక రావిచెట్టు పెట్టారు. అది పెరిగి పెద్దై మహా వృక్షంగా మారిపోయింది. అయితే ఇటీవలే భారీగా ఈదురుగాలులు రావడంతో ఇక ఆ చెట్టు ఒక్కసారిగా కూలిపోయింది. ఇక గ్రామస్తులు అక్కడికి చేరుకొని ఒక్కసారిగా షాకయ్యారు. రావి చెట్టు వేర్ల భాగంలో 5 తెల్లటి పాలరాతి శివ లింగాలు కనిపించాయి. అంతేకాదు పార్వతి నంది గణేశుడు కార్తికేయ విగ్రహాలతో పాటు మరో నాలుగు దేవతల ప్రతిమలు కూడా కనిపించడం గమనార్హం. దీంతో ఇదంతా శివుని మహత్యం కారణంగానే జరిగిందని అందరూ నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: