బెస్ట్ పొదుపు పథకాలను అందిస్తు ప్రజలకు రాబడిని ఇస్తున్న వాటిలో పోస్టాఫీస్ ఒకటి..కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కొత్త కొత్త పథకాలను కూడా అమలు చేస్తూ వస్తుంది.కేవలం బ్యాంకులలో మాత్రమే పథకాలు ఉండగా, ఇప్పుడు పోస్టాఫీసుల్లోనే అందుబాటులో ఉంటున్నాయి.తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందేందుకు వివిధ రకాల పథకాలు పోస్టాఫీసుల్లోనూ అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తు ప్రణాళిక కోసం ముందస్తుగా పోస్టాఫీసుల్లో ఉండే స్కీహలను ఎంచుకుని ఇన్వెస్ట్‌మెంట్‌ చేసుకోవచ్చు. దీని వల్ల మెచ్యూరిటీ తర్వాత లక్షల్లో రాబడి అందుకోవచ్చు. అయితే పోస్టాఫీసుల్లో ఉండే పథకాలు ఎప్పుడూ సురక్షితమే. లాభాలు ఎక్కువగా ఉంటాయి. వడ్డీ రేట్లు కూడా అధికంగానే ఉంటాయి. కొన్ని స్కీమ్‌లో బ్యాంకుల కంటే పోస్టాఫీసుల్లోనే ఎక్కువ రాబడి వచ్చేవి ఉంటాయి. దీంతో కేంద్రం పోస్టాఫీసుల్లో అద్భుతమైన పథకాలను ప్రవేశపెడుతోంది.


ఈ స్కీమ్‌లు సురక్షితంగా ఉండడమే కాకుండా ఎక్కువ రిటర్న్స్ పొందే అవకాశం దక్కుతుంది. ఈ పోస్టాఫీసులో ఉండే రికరింగ్ డిపాజిట్ పథకం కస్టమర్లకు మంచి లాభాలను తెచ్చి పెడుతోంది. అయితే పోస్టాఫీసులో ఉండే పథకాల్లో ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి బెనిఫిట్‌ పొందవచ్చని పోస్టల్‌ అధికారులు చెబుతున్నారు..రికరింగ్ డిపాజిట్ పథకం అనేది ఒక స్మాల్ సేవింగ్ స్కీమ్. ఇందులో ఎంత వీలైతే అంత డిపాజిట్ చేసుకోవచ్చు. ఇందులో 1, 2 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం కోసం కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో ప్రతి మూడు నెలలకు వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో వడ్డీ అనేది 5.8 శాతంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సేవింగ్ పథకాలపై వడ్డీని ప్రతి మూడు నెలలకోసారి జమ చేస్తుంది.


ఇక ఈ పథకంలో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయడం ద్వారా లక్షలాది రూపాయలు సంపాదించవచ్చు. ఈ పథకం ద్వారా రుణ సదుపాయం కూడా ఉంటుంది. ఈ పథకంలో 12 వాయిదాలు జమ చేస్తే.. రుణం కూడా తీసుకోవచ్చు. ఈ అకౌంట్‌లో జమ చేసిన మొత్తంలో 50 శాతం రుణం తీసుకోవచ్చు.పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకంలో నెలకు రూ.10వేల చొప్పున పెట్టుబడి పెట్టినట్లయితే 10 సంవత్సరాల అనంతరం మీరు రూ.16 లక్షల వరకు బెనిఫిట్‌ పొందవచ్చు. 10 సంవత్సరాల్లో మీరు జమ చేసేది 12 లక్షలు మాత్రమే. అయితే ఈ స్కీమ్‌ వ్యవధి పూర్తయిన తర్వాత 4 లక్షల 26 వేల 476 రూపాయలు అదనంగా పొందవచ్చు.


ఈ విధంగా మీకు 10 సంవత్సరాల తర్వాత 16 లక్షల 26 వేల 476 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఇలా పోస్టాఫీసుల్లో ఉన్న స్కీమ్‌లను సద్వినియోగం చేసుకుంటే మంచి వడ్డీ రేటుతో పాటు మంచి రాబడి పొందే అవకాశం దక్కించుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చాలా మంది పోస్టాఫీసులో ఉన్న పథకాలను ఎంచుకుంటున్నారు.. పిల్లల భవిష్యత్తుకు,చదువుకు ఇతర పనులకు సంభందించి ఈ పథకం మంచి బెనిఫిట్స్ ను అందిస్తుంది..మీకు ఈ స్కీమ్ వల్ల మంచి లాభాలు కూడా ఉన్నాయి..మీకు నచ్చితే ఇప్పుడే ఈ ప్లాన్ ను మీరు తీసుకోండి...


మరింత సమాచారం తెలుసుకోండి: