ప్రపంచ అపర కుబేరుడు ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్  ఎప్పుడూ కూడా వార్తల్లో నిలుస్తుంటాడు. ఈమధ్య కాలంలో ట్విటర్‌ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్.. ఉద్యోగుల తొలగింపు ఇంకా ట్విటర్‌లో బ్లూటిక్‌ టాపిక్ ..లాంటి వార్తలతో నిత్యం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు. ఇంకా అంతేకాదు.. అప్పుడప్పుడు వివాదాస్పద ట్వీట్లు కూడా చేస్తూ చాలా రకాలుగా కూడా విమర్శలపాలవుతున్నాడు. తాజాగా, ట్విటర్‌లో ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ అయితే ఇప్పుడు నెట్టింట వివాదాస్పదంగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ను ఉద్దేశించి ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఎలాన్ మస్క్ పేరెత్తకుండా డబ్ల్యూహెచ్ఓ అధినేత టెడ్రోస్ అధనామ్ చాలా ఘాటుగానే స్పందించారు. ఎలాన్ మస్క్ పేరు ప్రస్తావించకుండానే ఆయన చురకలు అంటించారు.ఇక భవిష్యత్తు మహమ్మారులను నిరోధించడం అలాగే వాటి విషయంలో వేగంగా స్పందించే ఉద్దేశంతో దేశాల మధ్య కొత్త ఒప్పందాలపై అనేక చర్చలు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎలాన్ మస్క్ డబ్ల్యూహెచ్ఓకు వ్యతిరేకంగా ట్వీట్ చేశాడు. 


ప్రపంచ ఆరోగ్య సంస్థకు దేశాలు తమ సార్యభౌమాధికారాన్ని అప్పగించొద్దు అంటూ ఎలాన్ మస్క్ తన ట్వీట్లో తెలిపాడు. అంటే, కరోనా సమయంలో డబ్ల్యూహెచ్ఓ సరియైన సమయంలో స్పందించక పోవటం వల్ల ప్రపంచ దేశాలు చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయని పేర్కొంటూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేసినట్లుంది.ఇక మస్క్ ట్వీట్ కు డబ్ల్యూహెచ్ఓ అధినేత అయిన టెడ్రోస్ అధనామ్ ఘాటుగా స్పందించాడు. మస్క్ పేరు ప్రస్తావించకుండా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.ఫేక్ న్యూస్ ల పై ప్రజలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. డబ్ల్యూహెచ్ఓ కు దేశాలు తమ సార్వభౌమాధికారాన్ని అప్పగించడం లేదని కూడా ఆయన అన్నారు. కేవలం కరోనా మహమ్మారులను సమర్థవంతంగా అడ్డుకోవడానికి మాత్రమే ఇది ఉపకరిస్తుందని ఆయన తెలిపారు. ప్రజలు పేద, ధనిక దేశంలో నివసిస్తున్నారా? అనే దానితో సంబంధం లేకుండా వారిని రక్షించేందుకు ఇది సాయపడుతుందని ట్రెడోస్ అధనామ్ ఎలాన్ మస్క్ కి గట్టిగా సమాధానం ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: