మూడురోజుల గుంటూరు జిల్లా పర్యటనలో తమ్ముళ్ళకి చంద్రబాబునాయుడుకు పెద్ద షాకే ఇచ్చారు. తాజా పర్యటనలో పెదకూరపాడు, తాడికొండ, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పర్యటించారు. పై మూడు నియోజకవర్గాల్లోను పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాలపైనే తమ్ముళ్ళతో పాటు చంద్రబాబు కూడా ఎక్కువ దృష్టిపెట్టారు. ఎందుకంటే ఎక్కువమంది తమ్ముళ్ళు పోటీచేయాలని పోటీలు పడుతున్నది పై రెండు నియోజకవర్గాల్లోనే. వీటిల్లో కూడా సత్తెనపల్లి చాలా కీలకమైనది. ఇలాంటి నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు అభ్యర్ధికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
విచిత్రం ఏమిటంటే అభ్యర్ధి కాదు చివరకు నియోజకవర్గం ఇన్చార్జిని కూడా ప్రకటించలేకపోయారు. మామూలుగా నియోజకవర్గం ఇన్చార్జంటే రాబోయే ఎన్నికల్లో టికెట్ కేటాయించటంలో సదరు నేతకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అంటే పేరుకు ఇన్చార్జే కానీ దాదాపు అభ్యర్ధనే లెక్క. ఇందుకనే నియోజకవర్గంలో నేతలు ఇన్చార్జిగా నియమించాలని చంద్రబాబుపై చాలాకాలంగా ఒత్తిళ్ళు చేస్తున్నది. అబ్బూరి మురళి, కోడెల శివరామకృష్ణ, యలమంచిలి వీరాంజనేయులు, రాయపాటి రంగబాబు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళుంటే తాజాగా కన్నా లక్ష్మీనారాయణ కూడా చేరారు.
ట్రాక్ రికార్డుచూస్తే కన్నానే అభ్యర్ధి అవటానికి ఎక్కువ అవకాశాలున్నాయి. పైగా బీజేపీలో నుండి టీడీపీలోకి వచ్చేపుడు టికెట్ పై హామీ తీసుకునే వచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇక్కడ సమస్య ఏమిటంటే ఎవరిని ఇన్చార్జిగా ప్రకటించినా మిగిలిన వాళ్ళు ఎలా రియాక్టవుతారో అనేభయం చంద్రబాబులో పెరిగిపోతోంది. కోడెలకు టికెట్ ఇచ్చేది లేదని చెప్పినా ఆయన మాత్రం వినిపించుకోకుండా తనకే టికెట్ అని చెప్పుకుని తిరిగేస్తున్నారట.
అంటే కోడెలను కూడా చంద్రబాబు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇక మిగిలిన నేతలను ఏ విధంగా కంట్రోల్ చేయగలరన్నదే పెద్ద సమస్యయ్యింది. అందుకనే ఇన్చార్జిగా ఎవరిని ప్రకటిస్తే ఏమి సమస్యలు వస్తాయో అన్న భయంతోనే పర్యటన ముగించుకుని వచ్చేశారంతే. దీంతో చంద్రబాబు ప్రకటనపై ఆశలు పెట్టుకున్న తమ్ముళ్ళకి పెద్ద షాక్ తగిలినట్లయ్యింది. కనీసం ఇన్చార్జిని కూడా ప్రకటించకుండా అందరు సమన్వయం చేసుకుని పనిచేయమని చెప్పుకుంటు ఎంతకాలం నెట్టుకొస్తారో చూడాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి