హైదరాబాద్ నగరంలో మొహర్రం ఎలా చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా పాత బస్తీలో ఈ పండుగని ఒక రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకుంటారు అక్కడి జనాలు. ఇక ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మొహర్రం ఊరేగింపునకు సర్వం సిద్ధమైంది.ఈ మొహర్రం ఊరేగింపులో భాగంగా ఈ రోజు హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది.శనివారం నాడు మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల దాకా ట్రాఫిక్ ఆంక్షలుంటాయని హైదరాబాద్ నగర పోలీసు అధికారులు తెలిపడం జరిగింది.కాగా.. మొహరం ఊరేగింపులో భాగంగా మహారాష్ట్ర నుంచి మాధురి ఏనుగును ప్రత్యేకంగా నిజాం ట్రస్ట్ నిర్వాహకులు ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ నగరానికి తీసుకురావడం జరిగింది. ఇక పాతబస్తీ డబీర్పుర బీబీకా అలవ నుండి బీబీకాఅలం దాకా ఊరేగింపు అనేది ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే ఉరేగింపుకు సంబంధించి అన్ని భద్రత ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.. దాదాపు 7 కిలోమీటర్ల మేర ఊరేగింపు అనేది ఉంటుంది. అందుకు దాదాపు 2000 మంది పోలీసులు బందో బస్తులో ఉండనున్నారు.


ఇందులో కేవలం స్థానిక పోలీసులే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్, క్రైమ్ టీమ్స్, షి టీమ్స్, ట్రాఫిక్ పోలీసులు ఇంకా అలాగే గతంలో ఇక్కడ పనిచేసి వెళ్లిన పోలీస్ అధికారులు కూడా ఉంటారని దక్షిణ మండలం డిసిపి తెలిపారు. అలాగే హైదరాబాద్ నగరంలోని బజార్ ఘాట్ లోని ఆశుర్ ఖన హజరత్ అబ్బాస్ లో కూడా రాత్రి మొహరం సంతాప దినాలు పురస్కరించుకొని స్థానికులు అగ్నిగుండం తొక్కడం జరిగింది. ఇక ఉన్నతస్థాయి అధికారులు తో పాటు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా అలంను దర్శించుకున్నారు.మధ్యాహ్నం పూట డబీర్ పుర బీబీ క అలవ నుండి మాధురి ఏనుగు పై బిబి క అలం ఊరేగింపు మొదలవుతాయి. షేక్ ఫైజ్ కామన్, ఇత్తెబర్ చౌక్, అలిజా కోట్ల, చార్మినార్, పంజేష, మీర్ అలం మండి, పురాని హావేలి, దారుల్ శిఫ, కాలి ఖబర్ ఇంకా చదర్గాట్ మస్జీద్ ఏ ఇలాహి దాకా కొనసాగుతుంది.ఇక ఈ ఊరేగింపులో షియా ముస్లింలు తమ శరీరాన్ని బ్లేడ్లు, కత్తులతో కోసుకుంటూ రక్తాన్ని చిందిస్తు తమ సంతాపాన్ని తెలియపరుస్తారు.మొత్తం 7 కిలోమీటర్లు సాగనున్న ఈ ఊరేగింపు కోసం చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉన్నతాధికారులు సీసీ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లని పర్యవేక్షించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: