ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయిని కార్గిల్ వార్ విజయం సాధించిన విషయంలో గుర్తు పెట్టుకుంటాం. అలాగని ఆయనను ఎక్కువగా గుర్తు పెట్టుకోము. ఎందుకంటే ఆయన హయాంలోనే పార్లమెంటు పై దాడి కూడా జరిగింది. అలాగే ప్రస్తుతం మనం నరేంద్ర మోడీని గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే ఆయన హయాంలోనే పఠాన్ కోట్ లోనూ, పుల్వామాలోనూ పాకిస్తాన్ భారత సైన్యంపై దాడి చేసింది.
దానికి బదులుగా పాకిస్తాన్ లోపలికి వెళ్లి మరీ దాడి చేసి వచ్చింది భారత్. అలాగే చైనా దేశం, శ్రీలంక దేశం రెండిటిని పక్కనపెట్టి పోలిస్తే చైనా సమర్థవంతమైన దేశం కాగా, శ్రీలంక అసమర్థవంతమైన దేశమని తెలుస్తుంది. తాజాగా శ్రీలంక తన ఓడరేవును చైనాకు అమ్మిందట. ఇదే అదనుగా తీసుకుని చైనా తన నిఘా నౌకలను ఈ ఓడరేవులో నిలుపుతుందట. అయితే చైనా ఆ ఓడరేవులో నిలిపిన నౌకలు యుద్ధ నౌకలని తెలిసినా కూడా శ్రీలంక తన అసమర్థతతో గట్టిగా చైనాని ఏమీ అనలేకపోతుందని తెలుస్తుంది
అలాగని భారత్ శ్రీలంకను అడిగినప్పుడు తాము ఆ ఓడరేవులో ఎలాంటి యుద్ధ నౌకలను, నిఘా నౌకలను అనుమతించడం లేదని చెప్తుంది. కానీ మరోపక్క చైనాను ఆ నౌకలను అక్కడనుండి తీసి వేయమని బ్రతిమాలుతుంది. తన జలాలలోకి వచ్చిన యుద్ధ నౌకలను, అది కూడా పరాయి వాళ్ళ యుద్ధ నౌకలను తన ప్రాంతాల్లో నుండి తీసివేయమని చెప్పే ధైర్యం కూడా లేదు శ్రీలంకకి. చైనా శ్రీలంక ఓడరేవును ఉపయోగించుకుని భారత్ భూభాగంలోని పోస్టులను మానిటరింగ్ చేయడం, విజువలైజ్ చేయడం చేస్తుందని తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి