ఎల్లోమీడియా తోకపత్రిక యాజమాన్యం ఏడుపేమిటో అర్ధంకావటంలేదు. మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావు-జగన్మోహన్ రెడ్డి మధ్య జరుగుతున్న యుద్ధంలోకి తోకపత్రిక యాజమాని దూరారు. మార్గదర్శి బ్రహ్మాండమని, అత్యంత విశ్వసనీయత కలిగిన సంస్ధగా సర్టిఫికేట్ ఇచ్చేశారు. అసలు మార్గదర్శిని తప్పుపట్టడానికి ఏమీలేదని కూడా తేల్చేశారు. రేపు ప్రభుత్వం మారితే జగన్ పరిస్ధితి ఏమిటో ఒకసారి ఆలోచించుకోవాలన్నట్లుగా పరోక్షంగా బెదిరింపులకు కూడా దిగేశారు.





ఇదంతా బాగానే ఉందికానీ చివరలో కేసీయార్ కు జగన్ కు ఒక తేడా ఉందన్నారు. గిట్టని మీడియాను మినహాయిస్తే కేసీయార్ ప్రతిపక్ష నేతలకు చెందిన వ్యాపారాలు, పరిశ్రమలను టార్గెట్ చేసి వేధించటంలేదట. వేధింపుల వల్ల తెలంగాణాలో పెట్టుబడులు పోతాయని కేసీయార్ కు తెలుసట. కేసీయార్ కు ఉన్న ఈమాత్రం ఇంగితం జగన్ కు లేదని తేల్చేశారు. ఇక్కడే తోకపత్రిక యాజమాన్యం ఇంగితం బయపడింది.





ఏపీలో జగన్ కూడా ప్రతిపక్ష నేతలకు చెందిన వ్యాపారాలు, పరిశ్రమలను ఎక్కడా టార్గెట్ చేయటంలేదే. చంద్రబాబునాయుడుకు చెందిన హెరిటేజ్ సంస్ధను ఇప్పటివరకు ముట్టుకోలేదని తోకపత్రిక యజమానికి తెలీదా ? టీడీపీ నేతలకు ఎన్నో వ్యాపారాలున్నాయి. వాటిల్లో దేన్నీ ప్రభుత్వం ముట్టుకోలేదు. ప్రభుత్వం మీద రామోజీ తన పత్రికలో పదేపదే బురదచల్లిస్తుంటే దానికి బదులుగా మార్గదర్శిలో సోదాలు, విచారణలను జగన్ ప్రారంభించారు. పైగా మార్గదర్శి మీద కేసును జగన్ పెట్టలేదు. 2006 లోనే మార్గదర్శి మీద మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ యుద్ధం మొదలుపెట్టారు.





మార్గదర్శి చిట్ ఫండ్స్ ను రామోజీ కేంద్రప్రభుత్వం, ఆర్బీఐ చట్టాలు, నిబంధనలకు విరుద్ధంగా ప్రారంభించినట్లు నిర్ధారణైందని ఉండవల్లి పదేపదే చెబుతున్నారు. మార్గదర్శిపై ప్రభుత్వం కుట్రలు చేస్తోందని రాధాకృష్ణకు అనిపిస్తే అసలు యుద్ధం మొదలుపెట్టిన ఉండవల్లిని పిలిపించి ఇంటర్వ్యూ చేయచ్చు కదా. జగన్ ప్రభుత్వాన్ని రామోజీ పదేపదే కెలికిన తర్వాతే జగన్ కూడా మార్గదర్శి కతేంటో చూడాలని అనుకున్నారు. అంతేకానీ తనంతట తానుగా జగన్ ఏరోజూ రామోజీ జోలికి వెళ్ళలేదన్న విషయాన్ని తోకపత్రిక యాజమాన్యం మరచిపోయిందేమో.  


 

మరింత సమాచారం తెలుసుకోండి: