చంద్రబాబునాయుడు అరెస్టు, రిమాండులో కొత్త అనుమానాలు పెరిగిపోతున్నాయి. రు. 371 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్కామ్ లో సీఐడీ అధికారులు చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అక్కడ అరెస్టు చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి 8 గంటలపాటు సుదీర్ఘమైన విచారణ తర్వాత 14 రోజుల రిమాండ్ విధించారు. రిమాండు కోసం చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇదే విషయమై ఒక ఛానల్లో న్యాయవాదులతో డిబేట్ జరిగింది.
అందులో పాల్గొన్న పట్టాభి అనే సీనియర్ క్రిమినల్ లాయర్ చెప్పిన విషయాలు ఆసక్తిగా ఉంది. ఆయన చెప్పిందేమిటంటే తాను అరెస్టవుతానన్న విషయం చంద్రబాబుకు ముందే తెలుసట. అనంతపురం జిల్లా పర్యటనలో చంద్రబాబు మాట్లాడుతు ఒకటి, రెండు రోజుల్లో తాను అరెస్టు అవుతానని చేసిన కామెంటును పట్టాభి గుర్తుచేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో తాను అరెస్టవుతున్న విషయాన్ని చంద్రబాబు ముందే ఊహించినట్లు అభిప్రాయపడ్డారు.
వెంటనే లీగల్ టీముతో పాటు ప్రత్యేకంగా సిద్దార్ధ లూథ్రాతో కూడా చర్చించే ఉంటారని అన్నారు. వాళ్ళలో ఎవరో ఇచ్చిన సలహా ప్రకారమే చంద్రబాబు నడుచుకున్నారట. అరెస్టుకు ముందే యాంటిసిపేటరీ బెయిల్ కు మూవ్ చేసుకోవాలన్న చిన్న విషయం చంద్రబాబుకు తెలీకుండా ఉండదని పట్టాభి అభిప్రాయపడ్డారు. అయితే తనపైన సీఐడీ పోలీసులు పెట్టబోయే నాన్ బెయిలబుల్ సెక్షన్ల విషయం కూడా ముందే తెలుసుంటుందన్నారు. అయితే పెట్టబోయే కేసులు నాన్ బెయిలబుల్ సెక్షన్లు కాబట్టి ముందస్తు బెయిల్ వచ్చే అవకాశాలు తక్కువే అని అర్ధముయ్యుంటుందట.
అందుకనే అరెస్టు చేసుకోనిచ్చి తర్వాత బెయిల్ కోసం పోరాటం చేసినట్లు పట్టాభి అన్నారు. కాకపోతే లీగల్ బృందం అనుకున్నదానికి వ్యతిరేకంగా జడ్జి 14 రోజుల రిమాండ్ విధించటం మాత్రం ఊహించని కోణమే అన్నారు. అంటే లాయర్ అభిప్రాయాలు విన్నతర్వాత అరెస్టు తప్పదని అర్ధమైపోయి సింపతి కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది. తొందరలోనే ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి తన అరెస్టును ఉపయోగించుకునే ప్లాన్లో ఉన్నారని తెలుస్తోంది. మరి చంద్రబాబు ప్లాన్ వర్కవుటవుతుందా ?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి