‘చంద్రబాబునాయుడు అనేక రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆయన ఎక్కడికి ప్రయాణించినా వెంట ఒక అంబులెన్స్, నిపుణుడైన డాక్టర్ ఉండాల్సిందే’..ఇది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ఆనారోగ్య పరిస్ధితిపై డాక్టరు ఇచ్చిన రిపోర్టు. స్కిల్ స్కామ్ లో అరెస్టయి రాజమండ్రి జైలు నుండి బెయిల్ పై బయటకు రావటం కోసం చంద్రబాబు చూపించింది డాక్టర్ల రిపోర్టే. కుడికంటికి  అర్జంటుగా క్యాటరాక్ట్  ఆపరేషన్ అవసరమని డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు ప్రకారమే కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.

కంటి ఆపరేషన్ అవసరమని మధ్యంత బెయిల్ తెచ్చుకుని తర్వాత గుండె సంబంధిత సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి రెగ్యులర్ బెయిల్ కూడా తెచ్చుకున్నారు. డాక్టర్ల రిపోర్టులో ఏముందంటే చంద్రబాబు బయట తిరగాలంటే కచ్చితంగా అన్నీ వసతులున్న ఒక అంబులెన్స్ తోపాటు ట్రైన్డ్ డాక్టర్ వెంట ఉండాల్సిందే అని ఉంది. ప్రైవేటు ఆసుప్రతి డాక్టర్ల రిపోర్టును నమ్మవద్దని, ప్రభుత్వ ఆసుప్రతిలో పరీక్షలు చేయించాలని సీఐడీ లాయర్ ఎంత మొత్తుకున్నా హైకోర్టు జడ్జి టీ మల్లికార్జున రావు వినిపించుకోలేదు.

డాక్టర్ల రిపోర్టు ఆధారంగా రెగ్యులర్ బెయిలిచ్చేశారు. బెయిల్ పిటీషన్ విచారించిన సమయంలో  చంద్రబాబు ఎలాంటి తప్పుచేయలేదని జడ్జి తీర్పు లాంటి వ్యాఖ్యలు చేయటంపైన  అప్పట్లోనే అడిషినల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. జడ్జి తన పరిధి దాటి వ్యవహరించారని పొన్నవోలు ఆక్షేపించిన విషయం అందరికీ తెలిసిందే. సరే ఇపుడు ప్రస్తుత విషయానికి వస్తే చంద్రబాబు రెండురోజులు ఢిల్లీలో ఉన్నారు. ప్రముఖ లాయర్ సిద్ధార్థ లూథ్రా కొడుకు పెళ్ళి రిసెప్షన్ కు హాజరయ్యారు. ఢిల్లీలో చంద్రబాబు పర్యటనలో ఎక్కడా అంబులెన్స్ ఉన్నట్లు టీవీ న్యూస్ లో కనబడలేదు.

అంబులెన్స్ లేకుండా ప్రయాణమే చేయకూడదని డాక్టర్లు రిపోర్టు నిజమే అయితే మరి అంబులెన్స్ లేకుండానే చంద్రబాబు ఎలా ప్రయాణం చేయగలిగారు. నిజానికి ఇన్ని హార్ట్ ప్రాబ్లెమ్స్ ఉన్న వాళ్ళని విమానాల్లో ప్రయాణించేందుకు అనుమతించరు. ఎందుకంటే విమానం గాల్లో ఉన్నపుడు జరగరానిది జరిగితే చంద్రబాబు ప్రాణాలకే ప్రమాదం. అయినా ఢిల్లీకి వెళ్ళారు హ్యాపీగా తిరిగొచ్చేశారు కూడా. రిసెప్షన్లో కూడా ప్రముఖులతో చంద్రబాబు హ్యాపీగానే ఉన్నట్లు ఫొటోల్లో కనబడింది. డాక్టర్లు రిపోర్టులో చెప్పినట్లు ఎక్కడా అనారోగ్య ఛాయలు కనబడలేదే...

మరింత సమాచారం తెలుసుకోండి: