ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనికూడా చూడకుండా చంద్రబాబునాయుడును జనసేన చితకొట్టుడు కొడుతోంది. మెగాబ్రదర్స్ అయితే చంద్రబాబును ఉతికి ఆరేశారనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏమిటంటే మండపేట, అరకు బహిరంగసభల్లో చంద్రబాబు మాట్లాడుతు ఇద్దరు అభ్యర్ధులను ప్రకటించారు. మండపేటలో జోగేశ్వరరావు, అరకులో సివేరి సోముకు టికెట్లు ప్రకటించారు. దాన్ని పట్టుకుని జనసేన పార్టీ ఆఫీసులో జరిగిన మీటింగులో అధినేత పవన్ కల్యాణ్ రాజోలు, రాజానగరంలో జనసేన పోటీచేస్తుందని ప్రకటించారు.
చంద్రబాబు రెండు నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించినపుడు తానెందుకు రెండు నియోజకవర్గాలను ప్రకటించకూడదని డైరెక్టుగా చంద్రబాబునే అడిగారు. దాంతో ‘తమలపాకుతో నువ్వు ఒకటంటే తలపుచెక్కతో నేను రెండంటాను’ అనే పద్దతిలో చంద్రబాబు ప్రకటనకు పవన్ ఫిట్టింగ్ రిప్లై ఇచ్చారు. పైగా ఏకపక్షంగా అభ్యర్ధులను ప్రకటించి చంద్రబాబు తప్పుచేశారని వేదికమీదే తీర్పిచ్చేశారు. పవన్ తీర్పుకు మొత్తం జనసేన నేతలంతా హ్యాపీగా ఫీలైపోయారు. అంటే టీడీపీతో పొత్తు విషయంలో జనసేన నేతల్లో ఎంతటి వైముఖ్యం ఉందో అర్ధమైపోతోంది.
సీన్ కట్ చేస్తే పవన్ సోదరుడు నాగబాబు ట్విట్టర్లో మూడు పోస్టులు పెట్టారు. అదేమిటంటే న్యూటన్ సిద్ధాంతాలను తన పోస్టుల్లో వివరించారు. అందులో ఒకటి ఏమిటంటే ‘ఫర్ ఎవరీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్’ అనే సిద్ధాంతం. నాగబాబు మనసులోని మాట ఏమిటంటే చంద్రబాబు ఏమిచేస్తే దానికి తగ్గట్లే పవన్ కూడా చేస్తారని. చర్యకు ప్రతిచర్య ఉంటుందని నాగబాబు చెప్పటంలో అర్ధమిదే.
పైగా మొత్తం సీట్లలో మూడోవంతు నియోజకవర్గాలు జనసేనకు కేటాయించాల్సిందే అని పవన్ చెప్పటం కూడా జనసేన నేతలు ప్రస్తావిస్తున్నారు. మొత్తం సీట్లలో మూడోవంతు అంటే 175లో సుమారు 58 సీట్లన్నమాట. అన్ని సీట్లలో జనసేన పోటీచేస్తే గెలిచేవి ఎన్ని ? అసలు అన్ని నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులున్నారా ? మిగిలిన 117 సీట్లలో పోటీచేయబోయే టీడీపీ ఎన్నింటిలో గెలుస్తుంది ? మొత్తానికి కూటమిలో బీటలను గమనిస్తుంటే జగన్మోహన్ రెడ్డి సంతోష పడిపోతున్నారనే అర్ధమవుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి