రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి ఇంకా గొల్ల బాబూరావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి.ఇద్దరు రెడ్డి సామాజికవర్గం, ఓ ఎస్సీ నేతకు అవకాశం కల్పించాలని జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈరోజు లేదా రేపు ప్రకటించే అవకాశం ఉంది.అలాగే మరోవైపు ఎల్లుండి మధ్యాహ్నం అసెంబ్లీలో రాజ్యసభ ఎన్నికలపై మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు.రాజ్యసభ ఎన్నికలకు వైసీపీ రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే మూడు స్థానాలకు అభ్యర్థులను కన్ఫర్మ్ చేసే పనిలో సీఎం జగన్ ఉన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో రాజ్యసభ స్థానాలకు సంబంధించి తుది నిర్ణయం ఈరోజు లేదా రేపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక అధికారికంగా అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. ముఖ్యంగా రాజ్యసభ సభ్యులకు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు పేర్లు గతంలోనే కన్ఫర్మ్ చేశారు. అయితే ఇందులో మూడో వ్యక్తికి సంబంధించి రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేత పేరునే పరిశీలిస్తున్నారు.


మేడా మల్లికార్జున్ రెడ్డి సోదరుడు అయిన మేఢా రఘునాథ్ రెడ్డి రాజ్యసభ పోటీలో ఉన్నారు. ఈ మూడు పేర్లు దాదాపు ఖరారు అయినట్లు సమాచారం తెలుస్తోంది. అధికారికంగా ఈరోజు లేదా రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 8 వ తేదిన రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా రాబోతోంది. ఇంకా అదే రోజున మధ్యాహ్నం ఎమ్మెల్యేలతో మాక్ పోలింగ్ కూడా జరగబోతోంది.ఇక రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ అభ్యర్థిని పెట్టే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి పొరపాట్లు జరక్కుండా అంటే గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు, అదే విధంగా అప్పుడు జరిగిన విధంగానే క్రాస్ ఓటింగ్ అనేది జరగకుండా ముందస్తుగానే వైసీపీ అలర్ట్ అయ్యింది. ఇందులో భాగంగానే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు ఇప్పటికే రంగం కూడా రెడీ చేశారు.అందుకు సంబంధించి రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు. అలాగే విచారణకు పిలిచారు.ఎల్లుండి 8వ తేదీన మరోసారి రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలవబోతున్నారు. ప్రత్యక్షంగా తమ వివరణని ఇవ్వబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: