జనసేన పార్టీ PACC సభ్యులైనటువంటి నాదెండ్ల మనోహర్ పైన జనసేన కార్యకర్తలు సైతం దాడి చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.. ముఖ్యంగా టిడిపి జనసేన పొత్తులో భాగంగా శనివారం రోజున అభ్యర్థులను సైతం ప్రకటించారు.. టిడిపి 94 స్థానాలలో బరిలోకి దిగగా జనసేనకు 24 స్థానాలలో సీట్లను ఇచ్చారు. నీతో ఒక్కసారిగా జనసేన కార్యకర్తలలో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది.. గత పదేళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న కనీసం పోటీ చేయకుండానే చాలామందిని వెలివేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.


అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ PACC సభ్యులు నాదెండ్ల మనోహర్ పైన ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజవర్గాలలో కూడా ఆందోళనలు అప్పుడే మొదలయ్యాయి.. పార్టీ ఆఫీసులలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీలను కూడా తీసేస్తూ దిష్టిబొమ్మలను కూడా దహనం చేస్తున్నారు. మరి కొంతమంది ఏకంగా రాజీనామాలే చేస్తూ ఉన్నారు.. తాజాగా తాడేపల్లిగూడెంలో జరగబోయే టిడిపి జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభను సైతం ఏర్పాటు చేసిన తర్వాత పరిశీలించడానికి నాదెండ్ల మనోహర్ వచ్చేశారు.. అయితే నాదేండ్ల మనోహర్ ను కలవడానికి జనసేన పార్టీ నుంచి తనకు ఇంచార్జ్ రామచంద్రారావు కూడా వచ్చారు.


దీంతో అక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేయగా ఈ క్రమంలోనే మరి కొంతమంది నాదెండ్ల మనోహర్ పైన దాడికి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టికెట్ ఇస్తామని మోసం చేస్తారా అంటూ దాడి చేసినట్టుగా బోల్లీ శెట్టి శ్రీను, కందుల దుర్గేష్ అడ్డుకొని అక్కడి నుంచి వారిని తీసుకెళ్లినట్టుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. ఏది ఏమైనా టికెట్ల విషయంలో అసలు టిడిపి తో పొత్తు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ మరొకసారి ఆలోచించాల్సిందన్నంతగా మారిపోయింది పవన్ కళ్యాణ్ సింగల్ గా పోటీ చేస్తే.. అన్ని నియోజకవర్గాలలో తమ పార్టీ నమ్ముకున్న వారిని నిలబెట్టవచ్చు.. ఒకవేళ సింగిల్ గా పోటీ చేస్తే 40 నుంచి 50 సీట్లు గెలుస్తారంటూ అభిమానులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: