ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి పార్టీ అధికారం లోకి వచ్చింది. ఇక ఈ పార్టీ కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉంది . ఆ తర్వాత వైసిపి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది . ఇక ఇప్పటికే వైసీపీ పార్టీ కూడా ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉంది . ఇక మరికొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన టైమ్ టేబుల్ అంతా విడుదల అయింది.

దానితో వైసిపి పార్టీ నేత అయినటువంటి జగన్ అలాగే ఆ పార్టీ నేతలు మరియు క్యాడర్ అంతా కూడా అనేక ప్రాంతాలను పర్యటిస్తూ జనాల మనసులను చూరగొనాడానికి వారి వంతు ప్రయత్నం వారు చేస్తున్నారు . అందులో భాగంగా మరికొన్ని రోజుల్లోనే జగన్ రాష్ట్రమంతా బస్ యాత్రను మొదలు పెట్టబోతున్నాడు . తాజాగా ఇందుకు సంబంధించిన అనేక విషయాలను ఈ పార్టీ సభ్యులు విడుదల చేశారు.    ఈ నెల 27 న "మేమంతా సిద్ధం" పేరుతో సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా తెలిపారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వచ్చే నెల  2 , 3 తేదీల్లో బస్సు యాత్ర ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. మూడో తేదీ సాయంత్రం తిరుపతి పార్లమెంట్ పరిధిలో బస్సు యాత్ర ప్రారంభమవుతుందని తిరుపతి పార్లమెంట్ పరిధిలో శ్రీకాళహస్తి , నాయుడు పేట లో బహిరంగ సభలు ఉంటాయని కూడా తెలిపారు. ఇక జగన్ చేయబోయే ఈ బస్సు యాత్రకు సంబంధించిన పనులు అన్ని ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: