ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రారంభించిన పార్టీలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఒకటి. ఈ పార్టీ వ్యవస్థాపకుడు అయినటువంటి కెసిఆర్ ఉద్యమ సమయంలో ఎంతో చురుగ్గా పాల్గొని ప్రజలను ఒక తాటిపైకి తీసుకువచ్చి ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించాడు. దానితో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కలను నెరవేర్చింది. ఇక ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతో పోరాడిన తెలంగాణ రాష్ట్ర సమితికి భారీ మెజారిటీని ఇచ్చి తెలంగాణ ప్రజలు కేసిఆర్ ను సీఎం చేశారు. ఆయన కూడా 10 సంవత్సరాల పాటు సీఎంగా కొనసాగారు.

ఇక తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. దానితో ఒక్కసారిగా బిఆర్ఎస్ పార్టీ డౌన్ అయిపోయింది. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే పార్లమెంట్ ఎలక్షన్లు జరగబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. దాదాపుగా బిఆర్ఎస్ పార్టీ ఏర్పడి 23 ఏళ్లు అవుతుంది. ఇప్పటివరకు ప్రతిసారి కెసిఆర్ కుటుంబ సభ్యులు అయినటువంటి కేటీఆర్ , కవిత , హరీష్ రావు లేదా కేసీఆర్ వీరి నలుగురిలో ఎవరో ఒకరు పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొంటూ వస్తున్నారు. 2019 వ సంవత్సరం నిజామాబాద్ లోక్ సభ నియోజక వర్గం నుండి కవిత పోటీ చేసి ఓడిపోయింది.

ఈ సారి కూడా ఈమె పోటీ చేస్తుందేమో అని అంత అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఈమె ఢిల్లీ లిక్కర్ మాఫియా కేసులో ఆరోపణలను ఎదుర్కొంటుంది. దానితో ఈమె కూడా ఈ సారి పార్లమెంట్ ఎలక్షన్ లో పాల్గొనే ఉద్దేశంలో లేదు అని తెలుస్తుంది. అలాగే కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ లో పాల్గొనే ఆసక్తిని చూపించడం లేదు అని తెలుస్తోంది. ఇదే కాని జరుగుతే పార్టీ ఏర్పడిన తర్వాత మొట్ట మొదటి సారి కేసీఆర్ కుటుంబం పార్లమెంట్ ఎలక్షన్ లకి దూరంగా ఉన్నట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: