ఎన్నికలకు సరిగ్గా 38రోజుల సమయం మాత్రమే ఉన్నది.. దీంతో అధికార పార్టీ వైసిపి అభ్యర్థులను ఖరారు చేసినప్పటి నుంచి ప్రచారంలో భాగంగా ముందుకు వెళ్తోంది.. పార్టీ కోసమే కష్టపడి పనిచేసిన వారిని మార్చకుండా కేవలం కొంతమందికి మాత్రమే టికెట్లు కేటాయిస్తూ సామాజిక వర్గాల ప్రాతిపదికన సీట్లను కూడా ఇవ్వడంలో వైసిపి పార్టీ అందరి చేత శభాష్ అనిపించుకుంది.. అయితే కొన్నిచోట్ల అభ్యర్థులను మార్చడంతో.. ఆ ప్రాంతాలలో మాత్రమే నిరసనలు మొదలయ్యాయి కానీ ఆ నిరసనల సెగ ఎక్కడా కూడా వైసిపి పార్టీకి తగలడం లేదు.. కానీ కూటమిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదో ఒక అసమ్మతి ఏర్పడుతూనే ఉన్నది.


ఇప్పటికే చాలామంది నేతలు నానా హంగామా చేశారు.. దీంతో కొంతమంది టీడీపీ పార్టీని వీడి వైసీపీ పార్టీలోకి చేరుతున్నారు.. ఇప్పుడు అనంతపురం అర్బన్ పరిస్థితి కూడా చంద్రబాబుకు చాలా తలనొప్పిగా మారుతోంది. మొదట ఈ స్థానం పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఇచ్చారు.. కానీ చివరికి టిడిపి వ్యక్తి అక్కడ పోటీ చేస్తున్నట్లు తెలియజేశారు.. అయితే అభ్యర్థి విషయంలో టిడిపి పార్టీ కోసం పనిచేసిన ప్రభాకర్ చౌదరిని కాదని దగ్గుబాటి ప్రసాద్ కి సీటును కేటాయించారు.. దీంతో అక్కడ టిడిపి నేతలు ఒక్కసారిగా బగ్గుమనడంతో నానా హంగామా చేశారు. దీంతో ఇప్పటికీ ప్రభాకర్ చౌదరికి సీటు ఇవ్వకపోవడంతో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోంది..

అంతేకాకుండా రాబోయే రోజుల్లో టిడిపి పార్టీకి ఓటు వేయమంటూ పెద్ద ఎత్తున నిరసిస్తున్నారు.. ఈ నిరసనలు ఇప్పటికీ కూడా తగ్గడం లేదు... దగ్గుబాటి ప్రసాద్.. సీటు కోసం చంద్రబాబు నాయుడుకి రూ.50 కోట్లు ఇచ్చారంటూ.. అందుకే ప్రభాకర్ చౌదరికి నమ్మక ద్రోహం చేశారంటూ ఆయన అనుచరులు వాపోతున్నారు. టిడిపి అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు మాత్రం ఈ ప్రచారాన్ని సైతం అడ్డుకుంటున్నారు.. నల్ల జెండాలు , నల్ల రిబ్బన్లు కట్టుకొని మరి ప్రదర్శనలు కూడా చేస్తున్నారు..


గో బ్యాక్ ప్రసాద్ అంటూ ప్రభాకర్ చౌదరి వర్గీయులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు.. తమ నేతకి టికెట్ ఇవ్వాలంటూ ప్రభాకర్ చౌదరి అనుచరులు డిమాండ్ చేస్తున్నారు.. దగ్గుబాటి ప్రసాద్ తో పాటు ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణను కూడా అడ్డుకున్నారు. మరి ఈ పరిస్థితులు ఎంతవరకు దారితీస్తాయో చూడాలి. మొత్తానికి అయితే ప్రభాకర్ చౌదరి కి టికెట్టు ఇవ్వకపోవడంపై దగ్గుబాటి ప్రసాద్ ను ఘోరంగా అవమానిస్తున్నారు ఆయన వర్గీయులు.

మరింత సమాచారం తెలుసుకోండి: