•ఓడిన చోటే అందలం ఎక్కిన సీమ నేతలు
•జే.సీ.బ్రదర్స్ రాజకీయ చతురత ముందు ఎవరైనా ఓడాల్సిందే
తాడిపత్రి గడ్డ జే.సీ.బ్రదర్స్ అడ్డా


(రాయలసీమ -ఇండియా హెరాల్డ్)

ఈ మధ్యకాలంలో రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన నాయకులు ఎంతోమంది సత్తా చాటుతూ దూసుకుపోతున్నారు.. ఒకే కుటుంబానికి లేదా ఒకే తల్లి కడుపున పుట్టిన బిడ్డలు ఒకే రాజకీయ పార్టీలో వివిధ  విభాగాలలో అధికారంలోకి వచ్చి సత్తా చాటుతుంటే .. మరికొంతమంది ఇతర రాష్ట్రాలలో కూడా వేరే పార్టీలలో చేరి రాజకీయంగా ఎదుగుతున్నారు.. ఇక ఈ క్రమంలోనే ఒకే తల్లి కడుపున పుట్టి ఇద్దరు అన్నదమ్ములు రాజకీయంగా చక్రం తిప్పడమే కాదు.. తమ వారసులను కూడా ఇప్పుడు బరిలోకి దింపారు. మరి వారి గురించి ఒకసారి చూద్దాం.


ఒకడే ఒక్కడు మొనగాడు తాడిపత్రిని మించిన తోపు.. 12 కార్పొరేషన్లు.. 75 మున్సిపాలిటీలు.. గత మూడు సంవత్సరాల క్రితం అన్నిచోట్ల వైసీపీ క్లీన్ స్లీప్.. కానీ ఆ ఒక్క ప్రాంతం మినహా.. అదే తాడిపత్రి నియోజకవర్గం.. తామె తాడిపత్రి తోపులమంటూ.. తమనెవరు ఢీ కొట్టలేరట మీసం మెలేసారు జేసీ బ్రదర్స్.. అనుకున్నట్టుగానే అధికార పార్టీకి ఎదురొడ్డి మరీ తాడిపత్రిని టిడిపి కైవసం చేశారు.. ఏపీ అంతా ఒక లెక్క తాడిపత్రి మరో లెక్క అంటూ నిరూపించారు జెసి బ్రదర్స్. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా జెసి ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఫలితాలు తర్వాత తీవ్ర ఉత్కంఠతను రేపుతూ ..తాడిపత్రి మున్సిపాలిటీ నీ టిడిపి కైవసం చేసుకుంది. ఇక తాడిపత్రిని ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలని అధికార వైసీపీ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. టిడిపి నేతలను కొనే ప్రయత్నం చేసిన  జేసీ బ్రదర్స్ రాజకీయ చాణిక్యం ముందు నిలవలేకపోయింది.


తాడిపత్రిలో టిడిపి తరఫున 20 మంది కౌన్సిలర్లు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిని జీర్ణించుకో లేకపోయిన  ప్రభాకర్ రెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని.. వరుస కేసులతో తనను ముప్పతిప్పలు పెడుతున్న అధికార పార్టీకి ఎలాగైనా షాక్ ఇవ్వాలని ..గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఈయన కౌన్సిలర్ గా బరిలోకి దిగి.. తనతో పాటు తన వారిని గెలిపించుకొని మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.. ఓడినచోట మళ్లీ అందలం ఎక్కి తాడిపత్రిలో తమకు తిరుగులేదని నిరూపించారు. ఇక ఆయన సోదరుడు జేసి దివాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. రాజకీయాలలో సీనియర్ నేత అనిపించుకున్న జెసి దివాకర్ రెడ్డి రాష్ట్ర విభజన ముందు వరకు కాంగ్రెస్ లో ఉన్నారు.. ఆ తర్వాత జెసి దివాకర్ రెడ్డి ఆయన సోదరుడు జే.సీ. ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ కూడా టిడిపిలోకి చేరారు. ఇక వీరిని అనుసరిస్తూ జెసి ప్రభాకర్ రెడ్డి కొడుకు జేసి పవన్ రెడ్డి అలాగే జెసి ప్రభాకర్ రెడ్డి తనయుడు జెసి అస్మిత్ రెడ్డిని కూడా తండ్రులను అనుసరిస్తూ టిడిపిలోకి చేరిపోయారు. ప్రస్తుతం జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి నియోజకవర్గం నుండి టిడిపి తరఫున ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.. మొత్తానికైతే ఒకే కుటుంబం నుంచి వచ్చిన ఈ నలుగురు రాజకీయంగా సక్సెస్ చూస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ దమ్మున్న నేతలుగా పిలిపించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: