కేసీఆర్  రాజకీయ వ్యూహాలు రచించడంలో దిట్ట. 10 ఏండ్లు తెలంగాణ రాజకీయాల్లో  సంచలనం సృష్టించిన  సీఎం అని చెప్పవచ్చు. అలాంటి కేసీఆర్  పది సంవత్సరాలపాటు ఏకధాటిగా పాలన తర్వాత ఒక్కసారిగా చతికిల పడిపోయారు.. కాంగ్రెస్ చేతిలో ఓటమిపాలై ఇంటికే పరిమితమయ్యారు. అయినా కేసీఆర్ మానియా తగ్గడం లేదు. ఆయన ఏ ప్లాన్ చేసిన  ముందు ముందు భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అలాంటి కేసీఆర్ వ్యూహాల ముందు ఇప్పటికి కూడా కాంగ్రెస్, బిజెపిలు  తేలిపోతున్నాయని చెప్పవచ్చు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 

అయితే కాంగ్రెస్ రాష్ట్రంలో గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారింది.  చాలామంది కేసీఆర్ సన్నిహితులు  బిజెపి, కాంగ్రెస్ పార్టీలలోకి వెళ్తున్నారు. అయినా కేసీఆర్ ఏ మాత్రం వణుకు బెనుకు లేకుండా లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులను  కరారు చేస్తూ ముందుగానే బి ఫాన్స్ కూడా ఇస్తున్నారు. జాతీయ పార్టీలు అయినటువంటి బిజెపి, కాంగ్రెస్ ల కంటే ఒక అడుగు ఆయన ముందుగానే ఉన్నారని చెప్పవచ్చు. పార్టీ పరిస్థితి బాగా లేకపోయినా  లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులను కేటాయించి వారికి బీఫామ్ అందించి ఖర్చులకోసం కూడా అమౌంట్ ఇస్తున్నారట. ఈ విధంగా కేసీఆర్  అద్భుత వ్యూహాలు రచిస్తూ ఉంటే సెంట్రల్ పార్టీ అయినటువంటి బిజెపి, కాంగ్రెస్ లు మాత్రం ఇంకా వారి అభ్యర్థులను కేటాయించడంలో విఫలమవుతున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ ఇంకా ఒకటి రెండు స్థానాలు అభ్యర్థులను ప్రకటించాలి. ఇప్పటికే ప్రకటించిన చోట్లలో కూడా అభ్యర్థులు గెలుస్తారా లేదా అనేది కూడా డైలమాలో ఉన్నారట. బిజెపి ప్రకటించిన స్థానాల్లో కొన్ని స్థానాలు మార్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇన్ని అవాంతరాల మధ్య కూడా  కేసీఆర్  ఏమాత్రం భయపడకుండా ఉన్న అభ్యర్థులను సీట్లు  కేటాయిస్తూ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారని చెప్పవచ్చు. అంతేకాకుండా  సభలు సమావేశాలు పెడుతూ  కార్యకర్తల్లో నూతన ఉతైజాన్ని  నింపుతున్నారు. ఈ వ్యూహాలు ఈ లోక్సభ ఎన్నికల్లో రిజల్ట్ అందిస్తాయా లేదంటే పూర్తిగా డీలా పాడేస్తాయా అనేది ఎన్నికల రిజల్ట్ తర్వాత తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: