• పెడనలో జెండా పాతేదెవరు.?
కృష్ణ ప్రసాద్ తాకిడిని సామాన్యుడు తట్టుకుంటాడా.?
• వేదవ్యాస్ సపోర్ట్ ఎటువైపో?


ప్రస్తుతం ఏపీలో రాజకీయం చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. అలాంటి ఏపీ పాలిటిక్స్ లో పెడన నియోజకవర్గం చాలా ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి జోగి రమేష్ ఉన్నారు. అయితే ఆయనకు ఈసారి వైసీపీ నుంచి పెడన నియోజకవర్గం టికెట్ రాలేదు. ఆయన స్థానంలో ఉప్పాల రామును బరిలోకి దించింది వైసిపి.. ఉప్పల రాము రాజకీయాలకు కొత్త.. అంతేకాకుండా ఆయనకు పెడన నియోజకవర్గంలో ఏ మాత్రం పట్టులేదు. అక్కడ వైసిపి క్యాడర్ కు కూడా రాము అంటే ఎవరో తెలియదు. అలాంటి రాము రాజకీయాల్లో చక్రాలు తిప్పినటువంటి కాగిత కృష్ణ ప్రసాద్ పై పోటీ చేస్తున్నారు. వీరి ఫ్యామిలీ ఇప్పటికే పెడనలో మంచి గుర్తింపు ఉన్నటువంటి ఫ్యామిలీ. ఇంత పెద్ద ఫ్యామిలీని ఈ సామాన్యుడు ఢీ కొడతాడా.. పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే వివరాలు చూద్దాం.

 ఉప్పల వర్సెస్ కాగిత:
 పెడన నుంచి  మంత్రి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయనను పెలమలురు నియోజకవర్గానికి పంపించేసింది వైసిపి పార్టీ. ఈ స్థానంలో ఉప్పాల రాముకు వైసిపి సీట్ ఖరారు చేసింది. అయితే ఆయన మంత్రిగా ఉన్న టర్మ్ లో ఏమాత్రం నియోజకవర్గ అభివృద్ధి లేకపోవడంతో,  మైనస్ చాలా వరకు  ప్రజల్లో ఏర్పడింది. ఇదే తరుణంలో ఉప్పల రాము విషయంలోకి వెళితే.. ఆయన నియోజకవర్గంలో పూర్తిగా అందరికి తెలిసిన అభ్యర్థి అయితే కాదు. వ్యక్తిగతంగా మంచి పేరు ఉన్నా కానీ, ఆయన సొంత పార్టీలో కూడా కొంతమందికి తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇక టిడిపి కూటమి విషయానికి వస్తే కాగిత కృష్ణ ప్రసాద్ ఎప్పటినుంచో ఇక్కడ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఆయన తండ్రి కాగిత వెంకటరావు  ఎమ్మెల్యేగా 2014లో చేశారు.


ఈ విధంగా కృష్ణ ప్రసాద్ కు పెడన నియోజకవర్గంలో ఏ మూలన వెళ్లినా నాయకులంతా పరిచయస్తులే. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో  టిడిపి మరియు జనసేన ఓట్లు కలుపుకుంటే వైసిపి కంటే ఎక్కువగా ఓట్లు ఉంటాయి. గత ఎన్నికల్లో జనసేనకు 25 వేల ఓట్లు పోలయ్యాయి. ఇప్పటికి జనసేన పార్టీ బలం చెక్కుచెదరలేదు. అలా అని వైసిపిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఓవరాల్ గా చూస్తే ఈ నియోజకవర్గంలో  టిడిపి సేఫ్ జోన్ లో ఉందని చెప్పవచ్చు. అయితే ఈ నియోజకవర్గంలో మరో బలమైన అభ్యర్థి వేదవ్యాస్ ఉన్నారు.  ఈయన టిడిపి టికెట్ ఆశించి బంగపడ్డారు. ఒకవేళ వేదవ్యాస్ టిడిపికి సపోర్ట్ చేయకుంటే మాత్రం  కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కృష్ణ ప్రసాద్ వేద వ్యాస్ ను కూడా కలుపుకొని వెళితే మాత్రం తప్పక గెలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  ఇక వైసిపి విషయానికి వస్తే.. ఉప్పల రాము  కొత్త వ్యక్తి అయినా సరే నియోజకవర్గం అంతా తిరుగుతున్నారట. వైసిపి చేసినటువంటి అభివృద్ధి పనులను వివరిస్తూ దూసుకెళ్తున్నారట. ఇలా రాము మరియు కృష్ణ ప్రసాద్ మధ్య హోరాహోరీ పోరులో పై చేయి ఎవరు సాధిస్తారు అనేది చెప్పడం కష్టంగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: