టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నోరు ఎత్తితే చాలు 40 ఇయర్స్ ఇండస్ట్రీ మూడుసార్లు సీఎం అయ్యా.. అవి నేను కనిపెట్ట..ఇవి నేను కనిపెట్టా అంటూ చెప్పుకుంటూ ఉంటారు. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చంద్రబాబు గొంతు మారింది. ముఖ్యంగా వాలంటరీలు ,ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియం, భూ వివాదాలు ,ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ,అమరావతిలో దళితులకు ఇళ్ల స్థలాలు ఇలా ఎన్నెన్నో వాటిపైన కూడా అసత్యమైన ప్రచారాలు చేశారు టిడిపి నేతలు.


వైసీపీ పార్టీ ఎలాంటివి చేసినా కూడా వాటిపైన అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆఖరికి ఎన్నికల ముందు అవన్నీ తూచ్ అని మేము వాటికంటే ఎక్కువ చేస్తామంటూ ప్రకటించుకున్నారు. ఇన్నేళ్ల తన అనుభవంలో ఫలానా వాటిని చూసి ఓటు వేయండి అని చంద్రబాబు చెప్పుకునే పరిస్థితులలో లేరంటే ఎంతకు మారిపోయారు చెప్పవచ్చు.. వైసిపి పార్టీ అధినేత జగన్ రెడ్డిని సైకో అంటూ చెప్పుకున్నప్పటికీ .. జనం మాత్రం నమ్మలేదు.. ఆ తర్వాత మళ్లీ జగన్ బాదుడే బాదుడు అంటూ చెప్పారు అప్పుడు కూడా నమ్మలేదు. మళ్లీ విధ్వంసం అన్నాడు అప్పుడు కూడా నమ్మలేదు..



పవన్ తో కలిసి గెలుద్దామని ధైర్యం కూడా రాలేదు ప్రధాన మోడీతో చేతులు కలిపినప్పటికీ కూడా చంద్రబాబుకి భయం పోలేదు. ఎన్నికల ముందు మేనిఫెస్టో రిలీజ్ చేయగా.. ఈ మేనిఫెస్టో పైన ప్రజలకు అసలు నమ్మకమే కలగలేదు.దీంతో ఇలా అన్నిటి మీద నమ్మకం కలగకపోవడంతో చివరికి బూతులు తిట్టే పరిస్థితికి ఏర్పడ్డారు ఈ పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. ఈ విషయం పైన వైసిపి శ్రేణులు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ఈ విషయాలను బట్టి అర్థం చేసుకోవచ్చు అంటూ తీవ్రమైన స్థాయిలో విమర్శలు చేస్తున్నారు..


ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనుకోని మాటలాడిని అనేసి చంద్రబాబు ఆఖరికి.. జగన్ అమ్మ, అమ్మమ్మ, నానమ్మ, తాత, ముత్తాతలను సైతం తిడుతున్నారంటే బాబు అనుభవం ఏమయింది అంటూ పలువురు నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. దీంతో చివరికి ఈ వాక్యాలకు ఎన్నికల కమిషనర్ జాగ్రత్తగా వ్యవహరించాలంటూ నోటీసులను కూడా జారీ చేసే పరిస్థితి ఏర్పడింది చంద్రబాబుకు.. దీంతో చివరికి చంద్రబాబు ఇంత పరిస్థితికి దిగజారి పోయాడా అనే విషయం మారిపోయింది.. వైసీపీలో కూడా చాలామంది నోరు తెరిస్తే బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కానీ మరి ఇంత దిగజారి మాట్లాడాలని పలువురు నేతలు వాపోతున్నారు. ఈ విషయాల పైన వైసిపి పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: