పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంమ్ ధ్వంసం చేసినట్లుగా పలు రకాల వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ వీడియోలన్నీ కూడా ఫేక్ వీడియోలు అంటూ అంబాటి రాంబాబు వెల్లడిస్తున్నారు. ఎన్నికల కమిషన్ నియంత్రణలో ఉండవలసిన ఈ వీడియోలు లోకేష్ ట్విట్టర్ లోకి ఎలా వచ్చాయంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. ఒకవేళ పిన్నేలి నిజంగానే తప్పు చేసి ఉంటే.. కచ్చితంగా చట్టం చూసుకుంటుందని వెల్లడించారు. ఈసి వీడియో రిలీజ్ చేయకుండా లోకేష్ కు ఈ వీడియో ఎలా వచ్చిందో చెప్పాలంటు ఆయన ప్రశ్నించారు.


అయితే లోకేష్ రిలీజ్ చేసిన ఈ వీడియో పైన ఈసీ కూడా చర్యలు తీసుకోవాలంటే తెలియజేశారు. పిన్నెల్లి వీడియో ఒరిజినలా కాదా అనే విషయాన్ని కూడా ఈసీ అధికారులు తేల్చాలంటు అంబాటి ప్రశ్నించారు. అదే బూతులో వైసీపీ సానుభూతిపరులు ఓటు వేస్తే ఒప్పుకొని పరిస్థితి ఉందని కూడా తెలియజేశారు. పోలింగ్ బూత్ బయటే వైసిపి మద్దతుదారులను టిడిపి కార్యకర్తలు సైతం చాలా హింసకు గురి చేశారని కూడా అంబాటి ఆరోపించారు. ఈ విషయం పైన పిన్నెల్లి ఫిర్యాదు చేశారని కూడా తెలియజేశారు.


అయితే ఏ ఒక్కరు కూడా ఈ విజ్ఞప్తిని అసలు పట్టించుకోలేదని అంబాటి ఫైర్ అయ్యారు. వైసీపీ కార్యకర్తల పైన దాడులు జరిగిన పోలీసులు అసలు ఏం మాట్లాడలేదని వెల్లడించారు. చాలా నియోజకవర్గాలలో బూతు క్యాంపెనీర్ జరిగిందని అంబాటి వెల్లడించారు.. తన సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో కూడా బూతు క్యాంపరింగ్ చేసిన తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేసుకున్నారని విధంగా కూడా ఆరోపించారు. వెబ్ క్యాంప్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేసినప్పటికీ ఎవరు వాటిని ఓపెన్ చేయలేదని తెలియజేశారు అంబాటి. ప్రస్తుతం అంబాటి చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. మరి ఫలితాల అనంతరం ఏం జరుగుతుందో చూడాలి. మరి ఫలితాలు ఎవరికీ అనుకూలంగా వస్తాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: