తెలుగు తమ్ముళ్లు దాదాపు 5 సంవత్సరాల నుంచి ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎంతోమంది అతిరథ మహారధుల మధ్య ఈ కార్యక్రమం ఎంతో అట్టహాసంగా  జరుగుతుంది. అయితే ఇక డిప్యూటీ ముఖ్యమంత్రిగా అటు పవన్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలోనే మిగతా మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. ఈ క్రమంలోనే అటు జగన్ క్యాబినెట్లో అవకాశం దక్కించుకున్న అతిపిన్న వయస్కులు ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇలా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అతిపిన వయస్కురాలు ఎవరో కాదు.. పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి వనత అన్నది తెలుస్తుంది.  పాయకరావుపేట నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి వైసిపి పై 43 వేల 737 ఓట్ల మెజారిటీతో గెలిచిన వంగలపూడి అనిత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. 1984 జనవరి ఒకటవ తేదీన విశాఖపట్నం జిల్లా ఎస్. రాయవరం మండలంలోని లింగరాజుపాలెం గ్రామంలో జన్మించారు వంగలపూడి అనిత. అయితే ప్రస్తుతం ఈమె వయసు 40 ఏళ్లు మాత్రమే కావడం గమనార్హం. ఈమె తర్వాత చంద్రబాబు క్యాబినెట్లో అతిపిన్న వయస్కుడిగా కొనసాగుతున్నాడు చంద్రబాబు తనయుడు నారా లోకేష్. 41 ఏళ్ళ వయసులో మంత్రి పదవిని చేపట్టారు. అయితే ఇలా చంద్రబాబు క్యాబినెట్లో  మంత్రి పదవి దక్కించుకున్న అతిపిన్న వయస్కురాలిగా  రికార్డు సృష్టించిన వంగలపూడి అనిత రాజకీయ నేపథ్యం చూసుకుంటే.. ఎంబీఏ పూర్తి చేసి టీచర్ ఉద్యోగం సాధించింది  ఆమె ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజవరంలో ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. ఉపాధ్యాయురాలిగా ఒకవైపు పాఠాలు చెబుతూనే మరోవైపు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2018లో ఇక టీటీడీ బోర్డు సభ్యురాలుగా కూడా నియమితులయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం కొవ్వూరు అసెంబ్లీ నుంచి బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. ఇక 2024లో మరోసారి టిడిపి తరఫున పాయకరావుపేట నుంచి బరిలోకి దిగి వైసిపి అభ్యర్థి కంబాల జోగులపై భారీ మెజారిటీతో విజయం సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: