ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు... ప్రమాణ స్వీకారం చేశారు. ఇక నారా చంద్రబాబు నాయుడుతో పాటు... మంత్రిగా పవన్ కళ్యాణ్ చేసేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అలాగే ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో... చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.
 

 వీరితో పాటు మరో 22 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న జనసేనకు మూడు మంత్రు పదవులు మాత్రమే రావడం  గమనార్హం. ఇలాంటి నేపథ్యంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు రెండు మంత్రి పదవులు వస్తాయని వార్తలు వస్తున్నాయి. డిప్యూటీ ముఖ్యమంత్రిగా... చంద్రబాబుకు సమానమైన  ఆ పదవి రావడం గ్యారంటీ అంటున్నారు. అయితే డిప్యూటీ ముఖ్యమంత్రితో పాటు మరో కీలక శాఖ పవన్ కళ్యాణ్ కు అప్పజెప్పనున్నారట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ కూడా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు దక్కుతుందని వార్తలు వస్తున్నాయి. గతంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నవారు హోం శాఖ బాధ్యతలను చేపట్టారు. ఇక ఇప్పుడు కూడా...  డిప్యూటీ సీఎం కాబోతున్న పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ హోం మంత్రిత్వ శాఖలు ఇవ్వాలని  కొత్త చర్చ తెరపైకి వచ్చిందట. ఇక దీనిపై చంద్రబాబు కూడా...  సంప్రదింపులు చేస్తున్నారట. తెలుగుదేశం కూటమి కోసం చాలా కష్టపడ్డ పవన్ కళ్యాణ్ కు.... డిప్యూటీ సీఎం తో పాటు హోం మంత్రిత్వ శాఖ ఇస్తే... చాలా బాగుంటుందని  భావిస్తున్నారట చంద్రబాబు.

 

 అయితే ఇవాళ...  తన కుటుంబంతోపాటు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు చంద్రబాబు వెళ్లారు. ఆయన రేపు విజయవాడకు వచ్చే ఛాన్స్ ఉంది. విజయవాడకు వచ్చిన తర్వాత... ఎవరికి ఏ శాఖలు ఇవ్వాలనే దానిపై ఫైనల్ నిర్ణయం తీసుకొని ఉన్నారట బాబు. అయితే... పవన్ కళ్యాణ్ కు కీలక శాఖలు ఇవ్వాల్సిందేనని.. అటు జనసేన కార్యకర్తలు, నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి పదవి రాలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కచ్చితంగా కీలక పదవులు కావాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: