2024 ఎన్నికలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి 164 సీట్లతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయానికి ముఖ్య కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్  చంద్రబాబు నాయుడు కూడా ఎన్నోసార్లు తెలియజేశారు. అందుకే పవన్ కళ్యాణ్ కు అటు జనసేన నేతలకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా పవన్ కు డిప్యూటీ సీఎంతో పాటు మరిన్ని శాఖలు కూడా ఇవ్వడం జరిగింది చంద్రబాబు.. అలాగే జనసేన ఎమ్మెల్యేలకు మరో రెండు శాఖలు కూడా ఇచ్చారు. దీంతో అటు కూటమి లో భాగంగా జనసేన టీడీపీ బీజేపీ నేతలు సైతం చాలా సంతృప్తి గానే ఉన్నట్లు తెలుస్తోంది.


అయితే ఇప్పుడు తాజాగా జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా కేటాయించాలని చంద్రబాబు ఆలోచనలు పడినట్లు తెలుస్తోంది. జనసేనలో ఆ పదవికి ఎవరికి ఇవ్వాలని విషయం పైన టిడిపి జనసేన చాలా కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నెల్లిమర్ల ఎమ్మెల్యే , వీరితోపాటు లోకం మాధవి పేర్లు కూడా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం చీఫుగా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పేరును చంద్రబాబు అయితే ఖరారు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కూడా ఆంధ్ర ప్రదేశ్ ని అభివృద్ధిలో ముందుకు నడిపిస్తామంటూ తెలియజేశారు అలాగే తాము చెప్పిన మేనిఫెస్టో ఉన్న సైతం ఒక్కొక్కటిగా అమలు చేస్తామని కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటివరకు పింఛన్ పెంపు ,మెగా డీఎస్సీ ,అన్నా క్యాంటీన్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటి విషయాల పైన సంతకాలు చేశారు అలాగే యువతకు కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కి వాటిపైన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినారు చంద్రబాబు. జనసేన నేతలు కూడా తమకు ఇచ్చిన మంత్రిత్వ శాఖలను సైతం ఒక్కొక్కరుగా నెరవేరుస్తూ ముందుకు వెళుతున్నారు. మరి రాబోయే రోజుల్లో మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: