అప్పుడు ముఖ్యమంత్రి  కేసీఆర్ చేసిన తప్పులే మళ్లీ ఇప్పుడున్న సీఎం  రేవంత్ రెడ్డి  చేస్తున్నారని అనేక వార్తలు వస్తున్నాయి. కానీ ఈ  అవకాశవాద రాజకీయాలకు శ్రీకారం చుట్టింది మాత్రం కేసిఆర్ అని చెప్పవచ్చు.   2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నారు. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నారు. 

బీఆర్ఎస్ 2004లో అప్పటి సీఎం వైయస్ క్యాబినెట్ లో ఐదుగురికి మంత్రి పదవులు వచ్చాయి.  అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో కేసీఆర్  కేంద్ర మంత్రి అయ్యారు. దీంతో కేసీఆర్ కుటుంబం అందరు కలిసి  సోనియా గాంధీని కలిసి తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ అందరూ గ్రూప్ ఫోటో దిగారు, బీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని అన్నారు. తీరా చూస్తే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా చేయాలని, గెలిచిన ఎమ్మెల్యేలు అందరికీ పదవుల ఆశ చూపి బీఆర్ఎస్లోకి తీసుకున్నారు.  

ఆనాడు ఆయనకు అవసరం లేకుండా ఎమ్మెల్యేలు అందరిని పార్టీలో చేర్చుకొని తన అహంకార భావాన్ని చూపించారు. పూర్తిగా రాష్ట్రంలో కాంగ్రెస్ ను లేకుండా చేయాలనుకున్నారు. కానీ చివరికి  తాను తోడుకున్న బావిలో తానే పడ్డట్టు, తాను ఒకటి తలిస్తే దేవుడోటి తలచినట్టు, ఆయన మొదలుపెట్టిన పద్ధతిని  కాంగ్రెస్ కూడా పాటిస్తోంది. తన పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు మరియు ఎమ్మెల్యేలు అంతా ఒక్కొక్కరిగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. అంతేకాకుండా రాబోవు రోజుల్లో బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కొంతమంది కాంగ్రెస్ లోకి వస్తే మరి కొంత మంది బిజెపి వైపు చూస్తున్నారట.  ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు అందరిని  పార్టీలో చేర్చుకుంటుంది. కాంగ్రెస్ పార్టీని లేకుండా చేద్దాం అనుకున్న కేసీఆర్ చివరికి ఆయన పార్టీనే లేకుండా చేసుకునే పరిస్థితికి తీసుకువచ్చారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: