
శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం మార్పుపై హాట్ కామెంట్స్ చేశారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. సత్య సాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ గా చేయాలంటూ టీడీపీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు టీడీపీ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. సత్యసాయి జిల్లా పేరులో ఎలాంటి మార్పు చేయకుండా... జిల్లా హెడ్ క్వార్టర్ ను హిందూపురం చేయాలంటూ గతంలోనే టీడీపీ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.
అయితే.. ఇప్పుడు అదే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. తాజాగా నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలతో మరోసారి సత్యసాయి జిల్లా కేంద్రం ఖాయం అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. అలాగే.. పేదల ఆకలి తీర్చేందుకు అప్పట్లో ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారని గుర్తు చేశారు టీడీపీ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. నిన్న సీఎం చంద్రబాబు గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించారని గుర్తు చేశారు.
ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 99 అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయని వెల్లడించారు టీడీపీ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. పేదలకు అన్న క్యాంటీన్ కడుపు నింపుతుందని వివరించారు. అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభం అవడం ఒక పండగ లాంటిదని స్పష్టం చేశారు టీడీపీ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. సీఎం చంద్రబాబుకు హిందూపురం అంటే ప్రత్యేక అభిమానమని చెప్పారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకున్నారని తెలిపారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకొస్తామని ప్రకటన చేశారు.